iDreamPost
android-app
ios-app

టర్కీ వెళ్లనున్న బాలయ్య 107

  • Published Jul 06, 2022 | 4:45 PM Updated Updated Jul 06, 2022 | 4:45 PM
టర్కీ వెళ్లనున్న బాలయ్య 107

నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ కి సంబంధించిన షూటింగ్ ని అతి త్వరలో రీ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ మధ్య బాలయ్యకు కరోనా పాజిటివ్ వచ్చాక చిన్న బ్రేక్ ఇచ్చారు. తిరిగి మళ్ళీ నెగటివ్ రిపోర్ట్ వచ్చేయడంతో రూట్ క్లియర్ అయ్యింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.

అతి త్వరలో ఈ టీమ్ టర్కీ వెళ్లనుంది. నిజానికి ముందు అమెరికాలో షెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ వీసా తదితర తతంగాలు ఆలస్యమయ్యాయి. దీంతో ఇప్పుడా షూట్ ని టర్కీకి షిఫ్ట్ చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన పనులు పూర్తయ్యాయని తెలిసింది. అక్కడ చిత్రీకరణ చేయబోయేది పాటనా ఇంకేదైనా యాక్షన్ ఎపిసోడా అనేది యూనిట్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతోంది.

మైత్రి సంస్థ భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తోంది. అఖండ తర్వాత తమన్ మరోసారి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ సిద్ధం చేయబోతున్నాడు. ఆ మధ్య బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వదిలిన చిన్న టీజర్ మాస్ లో ఓ రేంజ్ లో పేలింది. ఊర మాస్ లీడర్ అవతారంలో మరోసారి తమ హీరో విశ్వరూపం చూడొచ్చని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ దసరా లేదా దీపావళికి సినిమా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş