ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని తాను ఎదుర్కోలేకపోతున్నానని ఫీలయ్యాడట చంద్రబాబు. అందుకే జగన్‌ని ఎదుర్కోవడానికి తన బావమరిది బాలకృష్ణని రంగంలోకి దింపుతున్నాడట. అది కూడా తెలుగు భాషను ఉద్ధరించే టాపిక్‌కి సంబంధించి బాలయ్య మాట్లాడితేనే బాగుంటుందని చంద్రబాబు నిర్ణయించారట. ఈ నిర్ణయం భేష్ అని ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో ఆహా ఓహో అంటూ ప్రచారం స్టార్ట్ చేశారు రాధాకృష్ణ.
అప్పట్లో పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనకు సంబంధించి తెలుగులోనే మాట్లాడతానని సమైక్యాంధ్ర అంటూ హంగామా చేశాడు హరికృష్ణ. ఆ వెంటనే అదే హరికృష్ణ పదవి పోయేలా చంద్రబాబు డిసైడ్ చేశాడు. అయితే అదే హరికృష్ణ ఆనాడు పార్లమెంట్‌లో తెలుగు ఉద్ధరణ చేశాడు అంటూ ఇప్పుడు చంద్రబాబు మెచ్చుకున్నాడట. ఆనాడు పార్లమెంట్‌లో హరికృష్ణ చేసిన హంగామా స్థాయిలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ చేత తెలుగు భాషపై ఉపన్యాసాలు దంచేలా వ్యూహరచన చేస్తున్నారట చంద్రబాబు.
అసలు బాలకృష్ణను రంగంలోకి దించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందయ్యా అంటే దానికి టిడిపి జనాలు ఇచ్చే సమాధానం కూడా కామెడీగా ఉంది. మొదట్లో ఇంగ్లీష్ మీడియాన్ని పూర్తిగా వ్యతిరేకించిన చంద్రబాబు…. ప్రజలు తనను వ్యతిరేకించే పరిస్థితులు వచ్చాయని గుర్తించి అసలు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందే నేను అని టిడిపి మీటింగ్‌లో వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ మీడియంకి ఆద్యుడు చంద్రబాబే అని ప్రచారం చేయమని టిడిపి జనాలకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడిక అదే చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం వద్దు అని అంటూ తెలుగు గురించి గొప్పగా మాట్లాడితే మరీ కామెడీ క్యారెక్టర్ అయిపోతారు కదా. అందుకే బాలయ్యను రంగంలోకి దించుతారట.
ఆనాడు పార్లమెంట్‌లో హరికృష్ణ కామెడీ అయ్యింది కూడా ఇలాంటి బాబు డ్రామాలతోనే. రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదు, విభజన బిల్లుకు మొదటి ఓటు మేమే వేస్తాం అనే రేంజ్‌లో విభజనకు అనుకూలంగా చంద్రబాబు రాజకీయం చేస్తూ ఉంటే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడైన హరికృష్ణ మాత్రం ఆవేశంగా సమైక్యాంధ్ర అంటూ మాట్లాడి కామెడీ అయిపోయారు. ఇప్పుడు బాలయ్యబాబు చేత కూడా అదే రేంజ్‌లో కామెడీ చేయించాలని నిర్ణయించుకున్నట్టాడు చంద్రబాబు అన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. చంద్రబాబా…..మజాకానా.