iDreamPost
android-app
ios-app

ఎఫ్3 హీరోయిన్ కాబోయే భర్త నేపథ్యం

  • Published Mar 13, 2021 | 5:56 AM Updated Updated Mar 13, 2021 | 5:56 AM
ఎఫ్3 హీరోయిన్ కాబోయే భర్త నేపథ్యం

ఇప్పుడు కొంత ఫామ్ తగ్గింది కానీ మొన్నటిదాకా జోరుగా అవకాశాలు పట్టేసి స్టార్ హీరోల సరసన నటించిన మెహ్రీన్ త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న సంగతి తెలిసిందే. భవ్య బిష్ణోయ్ తో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇటీవలే అత్తారింటికి వెళ్లిన కాజల్ అగర్వాల్ తాలూకు జ్ఞాపకాలు ఇంకా ఫ్రెష్ గా ఉండగానే మెహ్రీన్ కూడా మూడు ముళ్ళకు సిద్ధమవ్వడం విశేషం. ఇప్పుడు ఈ నిశ్చితార్థం తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెహ్రీన్ ప్రస్తుతం ఎఫ్3లో వరుణ్ తేజ్ తో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి చిన్న బ్రేక్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి గాలి సంపత్ కోసం, వెంకటెష్ దృశ్యం 2 కోసం ఒకేసారి విరామం తీసుకున్నారు.

ఇక మెహ్రీన్ భర్త తాలూకు బ్యాక్ గ్రౌండ్ ఏమిటా అనే ఆసక్తి అభిమానుల్లో కలగడం సహజం. భవ్య బిష్ణోయ్ హర్యానాకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన భజన్ లాల్ మనవడు. ఈయన పదేళ్ల కిందట కాలం చేశారు. భవ్య తండ్రి కుల్దీప్ ప్రస్తుతం అదే రాష్ట్రంలో అదంపూర్ నియోజకవర్గానికి ఎంఎల్ఏగా ఉన్నారు. వీళ్లది పూర్తిగా రాజకీయ కుటుంబం. తల్లి సోదరులతో సహా అందరికీ ఇదే తరహా నేపధ్యం ఉంది. కాంగ్రెస్ కే ఈ ఫ్యామిలి అంకితమైపోయింది. భవ్య బిష్ణోయ్ సైతం ప్రస్తుతం వ్యాపారాలతో పాటు పొలిటికల్ కెరీర్ ని సెట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో మెహ్రీన్ తో పరిచయం ఎడడుగుల దాకా వచ్చింది

మెహ్రీన్ వివాహ తేదీ, వెన్యూ, రిసెప్షన్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎంగేజ్మెంట్ మాత్రం జైపూర్ లో చేశారు. అతి కొద్దిమంది సన్నిహితులను మాత్రమే పిలిచారు. ఇప్పటి తరం హీరోయిన్లు పెళ్లయ్యాక కెరీర్ డల్ అవుతుందనే దిగులు చెందడం లేదు. సమంతా లాంటి వాళ్ళు మంచి ఉదాహరణగా నిలుస్తున్నారు. అయినా మెహ్రీన్ కు ఇప్పటికిప్పుడు భారీ డిమాండ్ లేదు కానీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఎంపికను ఆచితూచి చేసుకుంటోంది. గత ఏడాది హీరోల వివాహాలతో టాలీవుడ్ లో సందడి నెలకొనగా ఇప్పుడు హీరోయిన్ల వంతు వచ్చింది.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet girişholiganbetvaycasinomarsbahis giriş