iDreamPost
iDreamPost
ఇటీవలే బాలయ్య నటించి దర్శకత్వం వహించిన నర్తనశాల 16 నిమిషాల ఫుటేజీని అభిమానులు బాగానే రిసీవ్ చేసుకున్న సంగతి తెలిసిందే. తీసింది రెండు సీన్లే కాబట్టి వాటికే పాత బిట్లు, టాప్ హీరో పాటను కలిపి ఏదో మేనేజ్ చేశారు. సౌందర్య, శ్రీహరి కాంబినేషన్ చూడగానే ఇది పూర్తయ్యి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమయింది. అయితే దీని కన్నా ముందే మరో భారీ చిత్రం ఆగిపోయిన విషయం ఇప్పటి తరానికి తెలిసే అవకాశాలు తక్కువ. అదే ఈ ఉదంతం. 2001లో బాలకృష్ణ హీరోగా ప్రసిద్ధ నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి తన ఆస్థాన డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో విక్రమసింహ భూపతి అనే జానపద సినిమాను ప్రకటించి సంక్రాంతి పండగ సందర్భంగా షూటింగ్ ప్రారంభించారు.
అశేష అభిమానుల కోలాహలం మధ్య లలిత కళాతోరణంలో కృష్ణంరాజు ముఖ్య అతిధిగా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. మంచి ఫామ్ లో ఉన్న అంజలా ఝవేరి, రోజాలతో పాటు బాలీవుడ్ భామ పూజ బాత్రాను హీరోయిన్లుగా తీసుకున్నారు. ఇతర కీలక పాత్రలకు నాజర్, శరత్ బాబు, ఎల్బి శ్రీరామ్, కేఆర్ విజయ తదితరులు ఎంపికయ్యారు. రామోజీ ఫిలిం సిటీలో కనివిని ఎరుగని ఖర్చుతో సెట్టింగ్స్ కూడా వేశారు. కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. అయితే ఏవో కారణాల వల్ల ఉన్నట్టుండి దాన్ని ఆపేశారు. బాలయ్య, కోడి మధ్య వచ్చిన విభేదాలకు మధ్యలో గోపాల్ రెడ్డి నలిగిపోయారని అప్పట్లో మీడియా కథనాలు వచ్చాయి కానీ వాటికి ఆధారాలు లేకపోవడంతో బయటికి ప్రపంచానికి నిజం తెలిసే అవకాశం లేకుండా పోయింది.
విక్రమసింహభూపతిలో బాలకృష్ణది డ్యూయల్ రోల్. అప్పటికే భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం, ఆదిత్య 369 లాంటి విలక్షణ చిత్రాలు తనకు మాత్రమే సాధ్యమని రుజువు చేసిన బాలయ్య మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ విధి తలపు మరోలా ఉంది. అప్పటిదాకా పెట్టిన ఖర్చుకు గోపాల్ రెడ్డి తీవ్ర నష్టాల పాలయ్యారు. ఇదే కాంబినేషన్లో గతంలో మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య లాంటి ఇండస్ట్రీ హిట్స్ తీసిన ట్రాక్ రికార్డు ఒక్క ఈ ఆగిపోయిన సినిమా వల్ల డ్యామేజ్ అయ్యింది. తర్వాత దీని ఊసు లేకుండా పోయింది. నర్తనశాల తరహాలో దీన్ని కూడా ఏదైనా ఓటిటిలో తీసినంత వరకు రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు కానీ గోపాల్ రెడ్డి కాలం చేశారు కాబట్టి ఆ నెగటివ్ ఉందో లేదో