దాదాపు పన్నెండేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసులో అసలు నిందితులెవరో ఇంకా తేలలేదు. పోలీసులు అనేకమందిని విచారించి చివరికి సత్యంబాబును దోషిగా నిర్ధారించి 2010 సెప్టెంబర్ 29 న 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కానీ 2017 మార్చ్ 31న ఆయేషా మీరా హత్యకేసులో హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదలచేసింది. దీంతో ఆయేషామీరా హత్యకేసులో చిక్కుముడి వీడలేదు.
కాగా ఆయేషా మీరా కేసులో మరిన్ని సాక్ష్యాధారాల కోసంఆయేషా మీరా భౌతికకాయానికి మరొకసారి పోస్ట్ మార్టం నిర్వహించాలని సీబీఐ భావిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఈ నెల 20 లోపు రీ-పోస్టుమార్టం పూర్తి చేయాలని సీబీఐ ప్రయత్నాలు చేస్తుంది. ఆయేషా మీరా భౌతిక కాయానికి కొద్దినెలల క్రితమే పోస్ట్ మార్టం నిర్వహించాలని సీబీఐ భావించింది. కానీ ఎందుకో అది సాధ్యపడలేదు. కానీ ఈ నెల 20 లోపు రీ-పోస్టుమార్టం నిర్వహించాలని సిబిఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసం స్థానిక అధికారులను సీబీఐ అధికారులు కలిసారని తెలుస్తుంది. ఇప్పటికైనా పారదర్శకంగా ఆయేషా మీరా హత్యకేసు దర్యాప్తు కొనసాగి అసలు నిందితులను గుర్తించి కఠిన శిక్ష విధించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.