Idream media
Idream media
భారత రాజ్యాంగం ఎంతో విశిష్టమైనది. ప్రపంచ దేశాలు ఇండియాలోని చట్టాలను ఎంతగానో గౌరవిస్తాయి. అందుకే మనమందరం స్వేచ్ఛగా ఓటు వేసి నచ్చిన నాయకులను అందళమెక్కిస్తాం. అధికారం దక్కిస్తాం.. మరి ఇన్ని చేసిన మనకు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి ఆ స్థానానికి న్యాయం చేస్తున్నారా. కచ్చితంగా మనమందరం ఒక్క నిముషం ఆలోచించాల్సిన విషయమే ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం.
ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి ఇలా చెప్పుకుంటూ పోతే మరెందరో ముఖ్యమైన ప్రజాసేవకులు మన రాష్ట్రంలో ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రణాళికతో పనిచేసేవారు కొందరైతే.. వ్యక్తి గత దూషణలతో కాలాన్ని వృధా చేస్తున్న వారు మరికొంతమంది. అవును చెప్పకనే చెప్పాల్సి వస్తుంది ఇలాంటి మాటలను. ప్రజా సమస్యలపై పోరాడాలి, మాట్లాడాలి, విజృంభించాలి, సమస్యలను పరిష్కరించాలి. కానీ నేటి రాజకీయనాయకుల తీరు ఇందుకు పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తోంది.
ప్రజా సమస్యల ప్రస్తావన ముసుగులో ఇప్పటి నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. చట్ట సభలను తమ తమ విమర్శల కోసం వాడుకుంటున్నారు.చట్టాలు చేయాల్సిన సభలో ఆరోపణలు, వాగ్వివాదలు ఎక్కువవుతున్నాయి. పార్టీ పరాయిదైతే మాట్లాడే రీతి మారిపోతుంది. క్రమశిక్షనే క్రమశిక్షణ తప్పుతున్న వేళ పరిస్థితులు చేజారుతున్నాయి.పెద్దరికం నవ్వులపాలు అవుతుంటే అంతా నవ్వుకుంటున్నారే తప్ప ఏ ఒక్కరూ మనస్ఫూర్తిగా వ్యతిరేకించడం లేదు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాల పనితీరు పై వ్యాఖ్యలకు అద్దం పట్టేలా ఉంది. ఏ చిన్న అవకాశం దొరికిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు అనుకోవడం తప్ప ఇంకేం కనిపించండం లేదు. మీడియాపై ఆంక్షల విషయంలో అధికార వైసిపి, విపక్షాల మధ్య అసెంబ్లీ దద్ధరిల్లింది. మీడియా స్వేచ్ఛను హరించేలా ఉన్న జీవో 2430ను రద్దు చేయాలని ర్యాలీగా టిడిపి సభ్యులు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకోవడంతో సభలో తీవ్రగందరగోళం నెలకొంది. చంద్రబాబును చీఫ్ మార్సల్స్ తోసేశారని టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. దీంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు అంతరాయం కల్పించాలనే ఉద్దేశంతోనే టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని మంత్రి బుగ్గన ఆరోపించారు. గతంలో యనమల స్పీకర్‌గా ఉన్నప్పుడు రూపొందించిన నిబంధనలు ఇవేనంటూ చదివి వినిపించారు. ఇందుకు అచ్చెన్నాయుడు ఘాటుగా బదులిచ్చారు. బుగ్గనకు తెలివి ఎక్కువైందని వ్యాఖ్యానించారు. విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించలేదని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి ఇప్పుడే రాజీనామా చేస్తానంటూ అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
ఒక్క సవాల్ మాత్రమే కాదు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఇంకా ఎన్నో మాటలు మనం వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. భావి తరాలకు మార్గదర్శకంగా ఉండాల్సిన నేతలు.. చులకన మాటలతో శాసనసభ గౌరవాన్ని తొక్కేస్తున్నాడు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు హుందాగా ప్రవర్తించాలి.