iDreamPost
android-app
ios-app

అసోం ప్రభుత్వం సరికొత్త గోల్డ్ స్కీం. పెళ్లి చేసుకునే వధువుకు 10గ్రా. బంగారం

అసోం ప్రభుత్వం సరికొత్త గోల్డ్ స్కీం. పెళ్లి చేసుకునే వధువుకు 10గ్రా. బంగారం

అరుంధతి గోల్డ్ స్కీమ్ తో అసోం ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకంలో భాగంగా పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు 10 గ్రాముల బంగారం ఉచితంగా ఇవ్ననున్నట్టు అసోం రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిస్వ శర్మ తెలిపారు. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 నుండి ప్రారంభించేందుకు అసోం ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు మంత్రి తెలిపారు.

ఈ పథకం ద్వారా దాదాపు ప్రభుత్వానికి 800 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అరుంధతి గోల్డ్ స్కీం ద్వారా మహిళా సాధికారత, బాల్య వివాహాలకు అడ్డుకట్టవేయవచ్చని అసోం గవర్నమెంట్ భావిస్తోంది. వివాహం రిజస్టర్ చేసుకున్న వధువు అకౌంట్ లో ప్రభుత్వం 10 గ్రాముల బంగారానికి బదులు రూ.30 వేలు డిపాజిట్ చేస్తుందన్నారు మంత్రి. దీంతో రాష్ట్రంలో వివాహా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ స్కీంలో వధువు వివాహ వయసు 18, వరుడి వివాహ వయస్సు 21 ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. వధువు కనీసం 10 వ తరగతి చదువుకుని ఉండాలి. వధువు కుటుంబం ఆదాయం సంవత్సరానికి రూ.5 లక్షల కంటే తక్కువ ఉండాలని, మొదటి వివాహానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని మంత్రి తెలిపారు. టీ గార్డెన్,ఆదివాసి గిరిజనులకు విద్యార్హత వర్తించదు. అసోం ప్రభుత్వం వారికి ఈ నిబంధనలను సడలించింది. ఎన్నికల కోసం ఇలాంటి పథకాన్ని పెట్టడం లేదని మహిళా సాధికారత కోసం ఇలాంటి స్కీంను ప్రారంభిస్తున్నట్టు మంత్రి శర్మ తెలిపారు.