ఓటీటీ తప్ప ఇంకో ఛాన్స్ లేకుండా పోయింది ప్రస్తుతం నిర్మాతలకి. ‘ఇంకొన్నాళ్ళు వేచి చూద్దాం..’ అనుకుంటున్న నిర్మాతల్లోనూ ఓపిక నశించిపోతోంది. ది¸యేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో ఓటీటీ ఆఫర్లను కాదనుకోలేకపోతున్నారు చాలామంది నిర్మాతలు. ‘వి’ సినిమా కోసం భారీ ఆఫర్ వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ విషయంలోనూ అలాంటి ప్రచారమే జరుగుతోంది. ‘నిశ్శబ్దం’కి కూడా అంతేనట. అయితే, ఇవన్నీ నిజమేనా.? ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేస్తే వచ్చే లాభం ఎంత.? అన్నదాని చుట్టూనే బిజినెస్ జరుగుతుంటుంది. సో, ఎలా చూసినా బయట ప్రచారంలో వున్న ‘ఫిగర్స్’ కరెక్ట్ కావని తేలిపోతోంది. అయితే, భారీగా ఖర్చు చేసి సినిమాలు నిర్మించేసి.. రిలీజ్ చేసుకోలేక ఆర్థిక ఇబ్బందుల్లో వున్న కొందరు ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. పెద్ద సినిమాలకు ఆఫర్లు బాగానే వస్తున్నా, రిలీజయ్యాక వస్తోన్న రెస్పాన్స్‌తో ఓటీటీ సంస్థలూ డీలా పడుతున్నాయి. దాంతో త్వరలోనే ఓటీటీ మీద అందరికీ మోజు తగ్గిపోతుందనే చర్చ సినీ పరిశ్రమలో జరుగుతోంది. కానీ, వేరే ఆప్షన్ ఏదీ.? ఈ ఏడాది సినిమా రిలీజుల సంగతి పెద్ద నిర్మాతలు మర్చిపోవాల్సిందేనేమో. సంక్రాంతి నాటికైనా ది¸యేటర్లు ఫుల్ అయ్యే స్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయో లేదో తెలియదు. అసలు థియేటర్లు ప్రారంభమయితే కదా, ఎప్పటికి పరిస్థితి అదుపులోకి వస్తుందో తెలిసేది.