iDreamPost
android-app
ios-app

పండగ బరిలో రానా అరణ్య – అఫీషియల్

  • Published Oct 21, 2020 | 7:10 AM Updated Updated Oct 21, 2020 | 7:10 AM
పండగ బరిలో రానా అరణ్య – అఫీషియల్

థియేటర్లు ఇతర రాష్ట్రాల్లో తెరుచుకున్నాయన్న మాటే కానీ కలెక్షన్లు మహా దారుణంగా ఉన్నాయి. ఆన్ లైన్లో సులభంగా అందుబాటులో ఉన్న పాత చిత్రాలు చూసేందుకు జనాలు ఏ మాత్రం ఇష్టపడటం లేదన్నది అర్థమైపోయింది. టైం బాగుంటే దీపావళి లేదా అదృష్టం కొద్ది క్రిస్మస్ కు దాదాపు అంతా సెట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు బోలెడు నమ్మకం పెట్టుకున్నాయి. అందుకే ఏ నిర్మాతా ఖచ్చితంగా ఫలానా టైంలో తమ సినిమా విడుదల చేస్తామని ప్రకటించలేదు. అందరూ వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. అందుకే ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉన్న రెడ్, ఉప్పెన, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా యూనిట్లు సైలెన్స్ మైంటైన్ చేస్తున్నాయి.

రానున్న రోజులు ఎలా ఉండబోతున్నాయో అంచనా వేయలేకపోవడమే దీనికి కారణం. రానా అరణ్య గురించి కూడా ఒకరకమైన కన్ఫ్యూజన్ మొన్నటిదాకా నెలకొంది. ఇప్పుడు దానికి చెక్ పెట్టేశారు. 2021 మకర సంక్రాంతి సందర్భంగా అరణ్యను థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనూ ప్రచారం విస్తృతం చేశారు. మొన్నటిదాకా ఓటిటిలో వచ్చే అవకాశాలు ఉన్నాయని వినిపించిన ముంబై టాక్ కు భిన్నంగా ఎరోస్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషమే. అప్పటికంతా పరిస్థితి సద్దుమణిగి పోవచ్చు. పబ్లిక్ మునుపటి లాగే రెగ్యులర్ గా సినిమా హాళ్లకు రావొచ్చు. అందుకే అన్నీ ఆలోచించి పండగను సెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.

సో స్టార్ హీరోలకు బదులు ఈసారి వెరైటీ పోటీ ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికైతే రంగ్ దే, అల్లుడు అదుర్స్ కూడా అదే సీజన్ ని లక్ష్యంగా పెట్టుకుని షూటింగ్ చేస్తున్నాయి. అరణ్య పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్న సినిమా కాబట్టి రీజనల్ గా వచ్చే కాంపిటీషన్ ని పట్టించుకోకపోవచ్చు. అసలే ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగింది. పోనీ డిసెంబర్ లో వదులుదామా అంటే 83 లాంటి క్రేజీ మూవీస్ లైన్ లో ఉన్నాయి. సో అరణ్యకు సంక్రాంతే కరెక్ట్. ప్రభు సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్న అరణ్యలో విష్ణు విశాల్ మరో కీలక పాత్ర చేశారు. పూర్తిగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడవి రక్షకుడిగా జంతువులంటే ప్రాణమిచ్చే వ్యక్తిగా రానా చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. శంతను మొయిత్రా సంగీతం సమకూర్చారు.