iDreamPost
android-app
ios-app

బీజేపీలో జగన్‌ కోవర్టులున్నారట..! వారెవరో హింట్‌ కూడా ఇచ్చిన అచ్చెం నాయుడు..!

బీజేపీలో జగన్‌ కోవర్టులున్నారట..! వారెవరో హింట్‌ కూడా ఇచ్చిన అచ్చెం నాయుడు..!

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల వేళ సరికొత్త రాజకీయ అంశాలు తెరపైకి వస్తున్నాయి. కారణాలేమైనా గానీ చాలా రోజులు తర్వాత టీడీపీ నేతలు బీజేపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలు కేవలం బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలకే పరిమతం చేస్తున్నారు టీడీపీ నేతలు.

తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు ఏపీ బీజేపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో జగన్‌ కోవర్టులు ఉన్నారని అచ్చెం నాయుడు అన్నారు. వారికి నిత్యం చంద్రబాబుని తిట్టడమే పని అంటూ అసహనం వ్యక్తం చేశారు.

బీజేపీలో ఉన్న జగన్‌ కోవర్టుల పేర్లు చెప్పని అచ్చెం నాయుడు.. వారెవరో అందరికీ అర్థమయ్యేలా స్పష్టమైన సంకేతం (హింట్‌) మాత్రం ఇచ్చారు. చంద్రబాబును తిట్టడమే బీజేపీలో ఉన్న జగన్‌ కోవర్టుల పని అనడంతోనే.. వారెవరో ఇట్టే తెలుసుకోవచ్చు.

Also Read : మార్ఫింగ్‌ ఫొటోలే కాదు.. వీడియోలు కూడా ఉంటాయా..? – పనబాక లక్ష్మీ

అచ్చెం నాయుడు చెప్పిన ప్రకారం.. చంద్రబాబును తిట్టే బీజేపీ నేతలందరూ జగన్‌ కోవర్టులేనన్న మాట. అంటే బీజేపీలో ఉన్న జగన్‌కోవర్డుల జాబితాలో కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, బీజేపీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జి సునిల్‌ ధియోధర్‌. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌ రెడ్డిలు ఉన్నారనుకోవాలి. వీరితోపాటు అచ్చెం నాయుడు చెప్పినట్లు చంద్రబాబును తిట్టే ప్రతి బీజేపీ నేత జగన్‌ కోవర్డుల కిందే జమ చేయాలి.

సరే.. వీరందరూ జగన్‌ కోవర్డులు అయితే.. ఇక బీజేపీ నేతలు ఎవరు..? అనే సందేహం రాక మానదు. చంద్రబాబును తిట్టని బీజేపీ నేతలు.. ఆ పార్టీకి చెందిన వారే.

అచ్చెం నాయుడు చెప్పిన ప్రకారం చూస్తే.. సుజనా చౌదరి, సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్‌ రావు, టీజీ వెంకటేష్, కన్నా లక్ష్మి నారాయణ , కామినేని శ్రీనివాస్, దగ్గుబాటి పురందేశ్వరి, యామినీ శర్మ.. ఇలా బాబును తిట్టని వారందరూ బీజేపీ నేతల కిందే లెక్క. వీరెవరూ ఎవరికీ కోవర్టులు కాదనే విషయం బీజేపీ అధిష్టానం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి.

Also Read : రత్నప్రభ నిజాలు దాచారా..?

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alAlobetAlobetPiabellacasinokatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş