iDreamPost
iDreamPost
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జారీ చేసిన షెడ్యూల్‌ను హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై తొలుత ఏపీ హైకోర్టు డివిజనల్ బెంచ్ విచారణ చేపట్టి ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎస్ఈసీ పిటిషన్ పై ఏపీ హై కోర్టులో నేడు వాదనలు ముగిసిన అనంతరం ఈ కేసుకు సంభందించి నమోదైన అనుబంధ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది . అనంతరం ఎన్నికల నిర్వహణకు సంభందించిన తీర్పుని రిజర్వ్ చేసింది.
Also Read: హైకోర్టు తీర్పు, నిమ్మగడ్డకి తెలిసొచ్చేనా?
ఈ నెల 8వ తేదీన పంచాయతీ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ షెడ్యూల్ జారీ చేయగా.. కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో సాధ్యం కాదంటూ, షెడ్యూల్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌ను నిలిపివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదంటూ కూడా ఆక్షేపించింది. నిమ్మగడ్డ నిర్ణయం ఆర్టికల్ 14, 21లన ఉల్లంఘించేదిగా ఉందని వ్యాఖ్యానించింది.