iDreamPost
android-app
ios-app

YS Jagan, AP Welfare Schemes – అర్హులకు నేడు సంక్షేమ లబ్ధి.. నేరుగా రూ. 703 కోట్లు జమ

  • Published Dec 28, 2021 | 4:25 AM Updated Updated Dec 28, 2021 | 4:25 AM
YS Jagan, AP Welfare Schemes – అర్హులకు నేడు సంక్షేమ లబ్ధి.. నేరుగా రూ. 703 కోట్లు జమ

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలకు సంబంధించి, అర్హత ఉన్నప్పటికీ సాయం పొందలేకపోయిన 9,30,809 మంది లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూ.703 కోట్లను మంగళవారం జమ చేయనున్నారు. ఇంతే కాకుండా 3,44,497 మందికి పెన్షన్‌ కార్డులు, 3,07,599 మందికి బియ్యం కార్డులు, 1,10,880 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల లబ్ధిదారులతో కలిపి మొత్తంగా 18,47,996 మందికి ప్రయోజనం కల్పించనున్నారు. ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ చేయనున్నారు.

అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి.. ఏటా జూన్, డిసెంబర్‌లలో సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో సాధ్యమైనంత మందికి పథకాల లబ్ధిని ఎలా ఎగ్గొట్టాలా అనే ఆరాటమే కనిపించేది. ఇప్పుడు అర్హులైన ఏ ఒక్కరూ పథకాల లబ్ధికి దూరం కాకూడదనే సంకల్పంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. 

ఏటా రెండు సార్లు అవకాశం..

అర్హులై ఉండి, ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారు.. సంక్షేమ పథకం అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తులు పరిశీలించి, అర్హులైన వారికి డిసెంబర్‌ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి జూన్‌లో లబ్ధి కల్పిస్తారు. జూన్‌ నుండి నవంబర్‌ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి డిసెంబర్‌లో లబ్ధి కల్పిస్తారు.   

దేశంలోనే ఎక్కడా లేని విధంగా..

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పారదర్శకంగా సోషల్‌ ఆడిట్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి, నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో అర్హులకు లబ్ధి కల్పిస్తోంది.

వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ (మహిళలు), వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు రబీ (2019–20), ఖరీఫ్‌ (2020), వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ (రెండవ విడత), జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహన మిత్ర, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, పెన్షన్‌ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పథకాల కింద మంగళవారం 9,30,809 మంది లబ్ధి పొందనున్నారు
  
టీడీపీ ప్రభుత్వంలో ఇలా..  

అస్మదీయులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందేవి. అర్హులకు ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచనలు. సంక్షేమానికి ఎలా కోత పెట్టాలా అనే పరిస్థితి ఉండేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే లబ్ధినందించే పక్షపాత జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, అక్కచెల్లెమ్మలు కాళ్లరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి మోకరిల్లాల్సిన దీనస్థితి ఉండేది. గ్రామానికి ఇంత మందికే లబ్ధి అనే కోటాలు విధించారు. లబ్ధిదారుల ఎంపికలో కాలయాపన చేసేవారు. ఎంత లబ్ధి కల్పిస్తారో.. ఎప్పుడు అందజేస్తారో తెలియని అనిశ్చితి ఉండేది. పథకాల సొమ్మును లబ్ధిదారుల ఇతర రుణాలకు జమ చేసుకునేవారు. 

Also Read : రైతు ముంగిటకే బ్యాంకు సేవలు

వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇలా.. 

కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. అవినీతి, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేస్తున్నారు. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ ప్రతి ఏటా రెండు సార్లు లబ్ధి కల్పిస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధి కోసం మధ్యదళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన. సోషల్‌ ఆడిట్‌ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నారు. దళారులకు, పైరవీకారులకు తావులేకుండా, ఇతర లోన్ల బకాయిలకు బ్యాంకర్లు మళ్లించుకోలేని విధంగా పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల అన్‌ ఎన్‌కంబర్డ్‌ ఖాతాలకు జమ చేస్తున్నారు. సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి, నిర్దిష్ట సమయంలోనే ఠంచన్‌గా లబ్ధి పంపిణీ సాగుతోంది. లబ్ధిదారుల ఆత్మాభిమానం నిలబడేలా వలంటీర్, సచివాలయ సిబ్బంది సేవలు అందజేస్తున్నారు. 

marsbahis girişgamdom girişjojobet girişjojobet girişsiteye gitJojobetjojobet