iDreamPost
android-app
ios-app

10 విద్యార్థి భవితకు భరోసా!

10 విద్యార్థి భవితకు భరోసా!

పదో తరగతి విద్యార్థులు విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన ముందడుగు వేసింది. విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా వారికి తగిన గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అత్యుత్తమంగా చదివే విద్యార్థులకు భవిష్యత్తులో మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కరోనా దెబ్బకు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రతిభ గల విద్యార్థులకు ఏమాత్రం నష్టపోకుండా చర్యలు తీసుకుంటోంది. పరీక్షలు రద్దు వల్ల విద్యార్థుల భవిష్యత్తుకు నష్టమని మొదటినుంచి భావిస్తున్న ఏపీ ప్రభుత్వం, అనుకోని పరిస్థితుల్లో పరీక్షల రద్దుకు వెళ్లాల్సి రావడంతో ఇప్పుడు విద్యార్థుల భవిత పైన దృష్టి పెట్టింది. పదో తరగతి మార్కులు అనేవి ప్రతి విద్యార్థికి ఎంతో కీలకమవుతాయి. భవిష్యత్తులో ఆ మార్కుల ఆధారంగానే ఉన్నత విద్యలో సీట్ల కేటాయింపు, ఉద్యోగాల భర్తీ, మెరిట్ వంటివి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి నుంచి ప్రభుత్వం టెన్త్ పరీక్షలు నిర్వహణ చేస్తామని చెబుతూ వచ్చింది. గత ఏడాది సైతం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా రద్దు అయితే విద్యార్థుల భవిష్యత్తు రెండు సంవత్సరాలు పూర్తిగా కుంటుపడుతుందని భావించింది. అయితే అనుకోని పరిస్థితిలో పరీక్షలు రద్దు చేయాల్సి రావడంతో ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు పై దిద్దుబాటు చర్యలకు ఏపీ ప్రభుత్వం చూస్తోంది.

పదో తరగతి ఫలితాల విషయంలో విద్యార్థులకు మేలు జరిగేలా ఎవరూ నష్టపోకుండా రాష్ట్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ‘ఆల్‌ పాస్‌’కు బదులు గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయించింది.

Also Read : బూట్లు లేని కాళ్లతో క్రీడా శిఖరంపైకి.. నిరుపేద రేవతి విజయాల పరుగు

ఫార్మేటివ్, సమ్మేటివ్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్ల ఖరారు చేయాలనీ విద్యాశాఖ భావిస్తోంది. దీనికి ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. భవిష్యత్‌లో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి ఈ పద్ధతి అవలంభించాలి అనే విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు.

ఫార్మేటివ్, సమ్మేటివ్‌లలో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టుల సగటు ఆధారంగా మార్కులు నిర్ణయించాలని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల గత విద్యా సంవత్సరం(2019-20)లో పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ‘ఆల్‌ పాస్‌’గా ప్రకటించారు. అయితే ఈ సంవత్సరం ఆల్ పాస్ నిర్ణయాన్ని పక్కనబెట్టి విద్యార్థులందరికీ గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. దీనివల్ల వరుసగా రెండు సంవత్సరాలు “ఆల్ పాస్ ” ఆప్షన్ వచ్చేలా ఉండదు. గ్రేడ్ల నిర్ణయాన్ని సైతం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, ఎలాంటి వివాదాస్పదం రాకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం విద్యా శాఖ ఉన్నతాధికారులకు సూచించింది. ఇప్పటికే దీనిపై కసరత్తు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పది విద్యార్థులందరికీ గ్రేడ్లు ప్రకటించి దాని ద్వారానే మార్కులు లిస్టు లు విడుదల చేయాలనేది అసలు ఉద్దేశం.

Also Read : ప్రజాక్షేత్రంలోకి సీఎం జగన్, మళ్లీ అభిమానుల్లో ఉత్సాహం