iDreamPost
android-app
ios-app

కరోనా ఎఫెక్ట్‌ : దీపావళి టపాసుల సరదా రెండు గంటలు మాత్రమే

కరోనా ఎఫెక్ట్‌ : దీపావళి టపాసుల సరదా రెండు గంటలు మాత్రమే

దీపావళి పండుగపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీపావళి పండుగ రోజున టపాసులు కేవలం రెండు గంటలు మాత్రమే కాల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు టపాసులు కాల్చేందుకు అనుమతి ఇచ్చింది. జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ ఆదేశాల మేరకు ఈ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.

కాలుష్య రహిత టపాసులు మాత్రమే విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దుకాణాల వల్ల శానిటైజర్‌ వినియోగించవద్దని సూచించింది. కాలుష్యకారక టపాసులు ఉపయోగిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉంటుందన్న హెచ్చరికలతో ఈ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

కాగా, దీపావళికి టాపాసులు విక్రయం, కాల్చడంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నిషేధం విధించాయి. కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కర్ణాటక, పంజాబ్‌ తదితర రాష్ట్రాలు టపాసులు కాల్చడాన్ని నిషేధించాయి. దీపాలతో పండుగను జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చాయి.