iDreamPost
android-app
ios-app

ప్రైవేట్ హాస్పిటళ్లకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం – ఐదు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు..

ప్రైవేట్ హాస్పిటళ్లకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం – ఐదు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు..

కోవిడ్ 19 ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్లకు వరంగా మారింది..ప్రజల్లో నెలకొన్న కరోనా భయాలను క్యాష్ చేసుకుంటూ ప్రజల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నాయి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్. అలాంటి ఐదు హాస్పిటల్స్ కు షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. నిబంధనలు అతిక్రమించి అధిక ఫీజులు వసూలు చేసారని తేలడంతో వాటి అనుమతులు రద్దు చేసింది.

వివరాల్లోకి వెళితే విజయవాడలో ఐదు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులను రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం.. ప్రజల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న కారణంతో కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులు రద్దు చేసింది.అనుమతులు రద్దు చేసిన వాటిలో రమేష్ హాస్పిటల్ కి చెందిన స్వర్ణ హైట్స్, ఎనికేపాడులోని లక్ష్మీ నర్సింగ్ హోం కి చెందిన హోటల్ అక్షయ, ఇండోబ్రిటిష్ ఆస్పత్రికి చెందిన ఐరా హోటల్ ,ఆంధ్ర హాస్పిటల్ కి చెందిన హోటల్ మర్గ్ కృష్ణయ్య,హోటల్ సన్ సిటీ ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ప్రజల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తేలడంతో పైన పేర్కొన్న ఐదు కోవిడ్ కేర్ సెంటర్ల అనుమతులను రద్దు చేస్తూ ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.