iDreamPost
android-app
ios-app

ఏ పంటకు ఎంత ధర – ముందే ప్రకటించిన ప్రభుత్వం

ఏ పంటకు ఎంత ధర – ముందే ప్రకటించిన ప్రభుత్వం

వ్యవసాయాన్ని పండగ చేసేలా.. సుదీర్ఘకాలం పాటు ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పంట వేసే ముందుగానే ఆయా పంటలకు మద్ధతు ధరను ప్రకటిస్తామని సీఎం జగన్‌.. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీని అధికారంలోకి వచ్చిన రెండో ఏడాదే అమలు చేశారు. ఈ రోజు వివిధ రకాల పంటలకు మద్ధతు ధరను జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఆహార ధాన్యాల నుంచి పప్పు దినుసులు, వాణిజ్య పంటలు, అపరాలతో సహా అన్ని రకాల పంటలకు క్వింటాల్‌కు మద్ధతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర కన్నా.. తక్కువగా మార్కెట్‌ ఉంటే ప్రభుత్వమే నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10, 641 రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే) శాశ్వత పంట కొనుగోలు కేంద్రాలుగా మారనున్నాయి. రైతులు తమ పంట ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాలో అమ్మకోవాలంటే పంట వేసే సమయంలోనే గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకుడు ద్వారా ఈ – కర్షక్‌లో పంట నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పంట చేతికి రాక ముందే ప్రకృతి విపత్తుల వల్ల నష్టం వాటిల్లితే బీమా కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. వాలంటీర్లు, వ్యవసాయ సహాయకుడు సంయుక్తంగా అన్ని పంటలను ఈ – కర్షక్‌లో నమోదు చేస్తున్నారు. పొలం వద్ద రైతు ఫొటో తీసి ఈ కర్షక్‌ నమోదు చేస్తున్నారు.

వివిధ పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఇలా..

1. పసుపు – 6,850

2. మిర్చి – 7,000

3. ఉల్లి – 770

4. చిరు ధాన్యాలు ( కొర్రలు, అంటు కొర్రలు, ఆరికెలు, వరిగలు, ఓదలు, సామలు) – 2,500

5. ధాన్యం (సాధారణ రకం) – 1,868

6. ధాన్యం ( గ్రేడ్‌ –ఏ)– 1,888

7. జొన్నలు (హైబ్రీడ్‌) – 2,620

8. జొన్నలు (పశువుల ధాణా – 1,850

9. జొన్నలు (మాల్‌ దండీ ) – 2,640

10. సజ్జలు – 2,150

11. రాగులు – 3,295

12. మొక్కజొన్నలు – 1,850

13. కందులు – 6,000

14. పెసలు – 7,195

15. మినుములు – 6,000

16. వేరు శెనగ – 5,275

17. కొబ్బరి (మర) – 9,960

18. కొబ్బరి (బాల్‌) – 10,300

19. పత్తి (పొట్టి పింజ) – 5,515

20. పత్తి (పొడుగు పింజ) – 5,825

21. బత్తాయి/చినీ – 1400

22. అరటి – 800

23. శెనగలు – 5,100

24. సోయాబీన్‌ – 3,850

25. పొద్దు తిరుగుడు – 5,885