iDreamPost
android-app
ios-app

నమ్మి వెంట నడిచిన వారికే డీసీసీబీ పదవులు

  • Published Dec 05, 2019 | 2:28 AM Updated Updated Dec 05, 2019 | 2:28 AM
నమ్మి వెంట నడిచిన వారికే డీసీసీబీ పదవులు

జగన్ నమ్మినవారికి గుర్తింపు ఇస్తారన్నా ప్రచారాన్ని నిన్నటి డీసీసీబీ నియామకాలలో మరోసారి నిజం చేశాడు. జిల్లాల వారీగా డీసీసీబీ చైర్మన్ల వివరాలు,

శ్రీకాకుళం- పాలవలస విక్రాంత్
మాజీ మంత్రి పాలవలస రాజశేఖరం కుమారుడు,పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సోదరుడు.

విజయనగరం – మరిసర్ల తులసి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే మరిసర్ల శివన్నాయుడు కోడలు తులసి గతంలో కూడా డీసీసీబీ చైర్మన్ గా చనిపోయారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి తులసి కుటుంబం వైసీపీతో ప్రయాణించారు. చదువు కోసం కర్ణాటకకు వెళ్లిన శివన్నాయుడు కొడుకు శింబ తులసిని ప్రేమ వివాహం చేసుకున్నారు.మామ,భర్త మరణం తరువాత తులసి ఢీలా పడకుండా సమర్ధవంతంగా రాజకీయాలను నడుపుతున్నారు.

విశాఖపట్నం – సుకుమార్ వర్మ
యలమంచలి ఎమ్మెల్యే కన్నబాబు కొడుకు ,గతంలో కూడా డీసీసీబీ చైర్మన్ గా పనిచేశాడు. టీడీపీ హయాంలో డీసీసీబీ లోని 23 మంది డైరెకర్ల కు గడువు ముగిసినా పదవి కాలం కొనసాగించిన TDP ప్రభుత్వం సుకుమార్ వర్మ పదవి కాలాన్ని మాత్రం కొనసాగించలేదు . దీని మీద సుకుమార్ వర్మ కోర్టుకు వెళ్లి తన కొనసాగింపుపై అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకున్నా ప్రభుత్వం వాటిని అమలుపర్చలేదు. దీనితో కన్నబాబు,సుకుమార్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కన్నబాబు యలమంచిలి నుంచి ఎమ్మెల్యేగా గెలువగా ,తన కొడుకును మరోసారి డీసీసీబీ చైర్మన్ గా నియమించుకొని కన్నబాబు తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు.

తూర్పుగోదావరి డీసీసీబీ – అనంత ఉదయ్ భాస్కర్
వైసీపీ ఏర్పాటు తరువాతమే నమామ వరుసయ్యే జ్యోతుల నెహ్రూతో పాటు వైసీపీలో చేరిన అనంత ఉదయ్ భాస్కర్ కు 2014లో ST రిజెర్వేడ్ నియోజకవర్గం రంపచోడవరం నుంచి పోటీచేయటానికి జగన్ అవకాశం ఇచ్చాడు. కానీ అనంత ఉదయ్ భాస్కర్ ST కాదని వివాదం రేగటంతో ఆయన సూచించిన వంతల రాజేశ్వరికి టికెట్ ఇచ్చారు. ఆవిడ గెలిచి టీడీపీలోకి ఫిరాయించింది. జ్యోతుల నెహ్రు టీడీపీలోకి ఫిరాయించిన ఉదయ్ భాస్కర్ వైసీపీలోనే కొనసాగి 2019 ఎన్నికల్లో కూడా రంపచోడవరం నుంచి వైసీపీ అభ్యర్థిని గెలిపించాడు. డీసీసీబీ పదవితో అనంత ఉదయ్ భాస్కర్ మంచి గుర్తింపు దక్కింది.

పశ్చిమగోదావరి – కవురు శ్రీనివాస్
2019 ఎన్నికల ముందు వరకు ఆచంట నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించిన కౌరు శ్రీనివాస్ టికెట్ ను రంగనాథ్ రాజు ఎగరేసుకొని వెళ్ళాడు. రంగనాథ్ రాజు గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఎన్నికలు ముగిసిన తరువాత శ్రీనివాస్ ను పాలకొల్లు సమన్వయకర్తగా నియమించారు. ఇప్పుడు డీసీసీబి పదవితో గుర్తింపును ఇచ్చారు.

కృష్ణా జిల్లా – యార్లగడ్డ వెంకటరావు
ఎన్నికలకు 10 నెలల ముందు రాజకీయ రంగప్రవేశం చేసి గన్నవరం లో హోరా హోరి పోరాడి వంశీ మీద ఎనిమిది వందల ఓట్ల స్వల్ప మెజారిటీతో యార్లగడ్డ వెంకటరావు ఓడిపోయారు. టీడీపీ తరుపున గెలిచితిన్ వంశీ టీడీపీ కి రాజీనామా చేసి వైసీపీలో చేరటానికి రంగం సిద్దమైన నేపథ్యంలో యార్లగడ్డ వెంకటరావు కు MLC దక్కుతుందని ప్రచారం జరిగింది . ఇప్పుడు డీసీసీబీ రూపంలో జిల్లాస్థాయి పదవి దక్కింది.

గుంటూరు – రాతంశెట్టి సీతా రామాంజనేయులు
కన్నా లక్ష్మి నారాయణ శిష్యుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన గుంటూరు రూరల్ మండలం జడ్పీటీసీ గా పనిచేశారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి వైసీపీతో పనిచేసాయిన రాతంశెట్టి సీతా రామాంజనేయులు నేరుగా జగన్ ఆశీస్సులతో జిల్లాస్థాయి పదవి పొందారు.

ప్రకాశం – మాదాసి వెంకయ్య
ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తూ ఎన్నికల ముందు వైసీపీలో చేరి కొండపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాదాసి వెంకయ్యకు డీసీసీబీ పదవి దక్కింది.

నెల్లూరు – ఆనం విజయ్ కుమార్ రెడ్డి
2014 ఎన్నికల ముందు ఆనం సోదరులు వివేకానందరెడ్డి, రామ్ నారాయణ రెడ్డి టీడీపీలో చేరినా ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరాడు. వివేకా మరణం తరువాత రామ్ నారాయణ రెడ్డి వైసీపీలో చేరిన తరువాత అన్నతో కలిసి వైసీపీ గెలుపుకు ఆనం విజయ్ కుమార్ రెడ్డి కృషి చేశారు.

చిత్తూరు – ఎం.రెడ్డమ్మ

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వర్గానికి చెందిన బీసీ మహిళా నాయకురాలు రెడ్డెమ్మ గతంలో జడ్పీ ఛైర్పర్సన్ గా పనిచేశారు. రాజకీయంగా కనుమరుగవున్న సమయంలో డీసీసీబీ పదవితో మరోసారి వెలుగులోకి వచ్చారు.

2001 చిత్తూరు జిల్లా పరిషత్తు ఎన్నికల్లొ కాంగ్రేసుకు 33 ZPTCలు,TDPకి 32 ZPTCలు గెలిచారు.ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు సొంత జిల్లా జడ్పీ పీఠాన్ని దక్కించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశారు. మొదటిసారి జడ్పీటీసీ గా గెలిచిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి త చంద్రబాబు మంతనాలు చేశారు. కరుణాకర్ రెడ్డి కలగచేసుకొని చెవిరెడ్డిని వైస్సార్ తో మాట్లాడించారు దీనితో కాంగ్రెస్ జడ్పీ పీఠం గెలిచింది,చెవిరెడ్డికి వైస్సార్ తో అనుంబంధం ఏర్పడింది.

కర్నూలు – మాధవరం రామిరెడ్డి
కర్నూల్,అనంతపురం జిల్లాలలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి కర్నూల్,అనంతపురం,హిందూపూర్ లోక్ సభ కు బీసీ నాయకులను గెలిపించిన జగన్ ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన బోయ నేత మాధవరం రామిరెడ్డిని నియమించారు.

కడప – తిరుపాల్ రెడ్డి
కమలాపురం ఎమ్మెల్యే,జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తమ్ముడికి పిల్లనిచ్చిన మామ అయిన దువ్వూరు తిరుపాల్ రెడ్డికి మరోసారి డీసీసీబీ పదవి దక్కింది.

గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా తిరుపాల్ రెడ్డి డీసీసీబీ చైర్మన్గా పనిచేశారు. మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపులో తిరుపాల్ రెడ్డిది కీలపాత్ర. తిరుపాల్ రెడ్డికి డీల్ రవీంద్రనాథ్ రెడ్డితో ఉన్న విబేధాల కారణంగా ఆయన ఓటమే లక్ష్యంగా 2009లో ప్రజారాజ్యం తరుపున పోటీచేశారు.

అనంతపురం- బోయ వీరంజనేయులు
కర్నూల్,అనంతపురం జిల్లాలలో బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత కొనసాగిస్తూ బోయ వర్గానికి చెందిన వీరంజనేయులు కు డీసీసీబీ పదవి ఇచ్చారు.