iDreamPost
android-app
ios-app

తిరుమలకు చేరుకున్న సీఎం జగన్‌

తిరుమలకు చేరుకున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తిరుమల చేరుకున్నారు. నిన్న మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి నుంచి ఢిల్లీ వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌.. కేంద్ర మంత్రి అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై వారితో చర్చించిన సీఎం జగన్‌.. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో బయలుదేరి తిరుమలకు చేరుకున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన సీఎం జగన్‌.. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు వచ్చారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు సాయంత్రం సీఎం జగన్‌ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం స్వామి వారి సేవలో తరించనున్నారు. రాత్రికి తరుమలలోనే బస చేయనున్నారు. రేపు గురువారం ఉదయం కర్ణాటక రాష్ట్రం తిరుమలలో నిర్మించే భవనానికి ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్పతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తాడేపల్లి చేరుకోనున్నారు.