iDreamPost
android-app
ios-app

సంక్రాంతి హీరో జగనే!!

సంక్రాంతి హీరో జగనే!!

తన రాజ్యంలోని వారి శ్రేయస్సు సంక్షేమం సంస్కృతిని కాపాడే వాడే నిజమైన రాజు అని పురాణాలన్నీ చెబుతుంటాయి. సంక్రాంతి పండుగ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటు సంక్షేమాన్ని అటు సంప్రదాయాన్ని కలగలిపిన కొత్త రకపు అద్భుతమైన పెద్ద పండుగను వీక్షించారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వం ఎక్కడ మాట తప్పకుండా అమ్మ ఒడి కి సంబంధించిన 14 వేల రూపాయలను వారివారి అకౌంట్లలో వేయడంతో ఆ సొమ్ము పండగవేళ పేదలకు అక్కరకు వచ్చింది. సరిగ్గా పండగ ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి మరొమాట లేకుండా అమ్మఒడి సోమ్మును మొత్తం వేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లులు ఎకౌంట్లో 44 లక్షల అకౌంట్లలో… ఒక్కొక్కరికి 14 వేల చొప్పున జమ చేయడంతో పండగ వేళ మహిళాలోకం ఆనందంగా పండగ జరుపుకున్నారు. కరుణ సమయంలో పనులు లేక అల్లాడుతున్న వారికి ప్రభుత్వం ఇచ్చిన ఈ సొమ్ము ఆసరాగా నిలిచింది.

సంప్రదాయం పాటించి!!

తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రమైన సంక్రాంతి పండుగను ముఖ్యమంత్రి జగన్ వారితో మమేకం అయ్యేందుకు, తెలుగు సంప్రదాయాన్ని గౌరవిస్తూ పంచెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. మంత్రి కొడాలి నాని గుడివాడ లో ఏర్పాటు చేసిన ఎడ్ల పందాల్లో మొదటి రోజు పాల్గొన్న సీఎం తర్వాత రోజు సంక్రాంతి పండుగ వేళ పట్టు పంచె, పైజమా ను ధరించి ప్రభుత్వ ఆధ్వర్యంలో పండుగ జరపడం ఈసారి విశేషం. అలాగే కనుమ పండుగ రోజు గోమాతను పూజించి ఆయన తెలుగు వారి సంప్రదాయం పట్ల మక్కువ చూపారు. సీఎం ఈసారి సంక్రాంతి వేడుకల్లో తమ ప్రజల సంక్షేమాన్ని, తమ రాష్ట్ర సంప్రదాయాన్ని పాటించి ఎన్నడూ లేనట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమం సంప్రదాయం ఒకే వేదికపైకి జగన్ తీసుకురావడంలో విజయం సాధించారు. సంక్రాంతి హీరోగా ఆయన నిలిచిపోయారు.

డీజీపీ చెప్పింది నిజం కదా!!

రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల వెనుక రాజకీయాలు, పార్టీలు ఉన్నాయని పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ చెప్పగానే తమ పార్టీలో ఉన్నవారిని పాటించాల్సిన వారిని పార్టీ నుంచి వెళ్లి వేయాల్సిన విపక్షాలు… విధ్వంసం సృష్టించే వారిని కాపాడుతూ, నిజం మాట్లాడిన పోలీస్ బాస్ గౌతమ మీద పడ్డారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే పోలీస్ బాస్ మీద పరువు నష్టం దావా వేస్తా మంటూ చెప్పడం నిజంగా విచిత్రమే. చంద్రబాబు సైతం గౌతమ్ సవాంగ్ అధికార పార్టీ కు అనుకూలంగా మాట్లాడారంటూ చెప్పడం చూస్తే వీరు ఒక వ్యవస్థను నడిపిస్తున్న పోలీస్ బాస్ మీద ఎంతటి గౌరవం ఉందో అర్థమవుతుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా చంద్రబాబు ఒక సర్వోన్నత పోలీసు అధికారిని అర్థం చేసుకున్న తీరు ఇదేనా అన్న అనుమానం కలుగుతుంది.

పోలీస్ చెప్పింది సరైనదే!

డీజీపి మొత్తం హిందూ ఆలయాల మీద 31 దాడులు వెనుక ఎవరు ఉన్నారు అన్న దాన్ని పేర్లతో సహా చదివి వినిపించారు. వారి మీద పోలీస్ శాఖ ఎలాంటి యాక్షన్ తీసుకుంది అన్నది కూడా చెప్పారు. పనిలోపనిగా ఇవేమీ ఇప్పుడు కొత్తగా జరుగుతున్న దాడులు కావని గతంలో సైతం ఆలయాల మీద చిన్నచిన్న దాడులు జరిగిన మాట వాస్తవమేనని లెక్కలు తీసి మరీ వివరించారు. ఇప్పుడు ఆలయాల మీద జరిగిన చిన్న చిన్న దాడిని లేదా గతంలో జరిగిన వాటిని సైతం వివిధ పార్టీలకు చెందిన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టి విపరీతంగా ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో దర్యాప్తులో తేలింది. ఈ విషయాన్ని డీజీపీ ఆయన ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఒక కేసు దర్యాప్తు చేసినప్పుడు దాని వెనుక ఎవరు ఉన్నారన్నది పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉంటుంది. ఆ దిశగానే వారు దర్యాప్తులో ముందుకు వెళ్తారు. డిజిపి చెప్పినదాని ప్రకారం గ్రామాల్లో జరిగే చిన్న చిన్న విషయాలను లేదా పాత విషయాలను కొందరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎలాగో ఇలాంటివి ప్రచారం చేసే అవకాశం ఉండదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు ఆ పార్టీ కార్యకర్తలు చేసే అవకాశం లేదు కాబట్టి… కచ్చితంగా దీనిని ప్రభుత్వం మీద బురదజల్లే చర్యగా చేసేందుకు వరుసగా జరుగుతున్న ఆలయాల ఘటనల్లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉండటం సహజం. దీనిపై వెంటనే పార్టీ కార్యకర్తలను, చేస్తున్న వారిని మందలించాలి సేన పార్టీ అధ్యక్షులు ఇది చంద్రబాబు, సోము వీర్రాజు సైతం డీజీపీ మీద విరుచుకుపడడం చూస్తే ఖచ్చితంగా వీధి ప్రమేయంతోనే వారి పార్టీ కార్యకర్తలు ఆలయాలపై దాడులు, పాత విషయాలను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూస్తున్నట్లు భావించాలి.

ఫోన్ ఉంటే పెట్టెయ్!

ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు అలాంటి ఘటనలు వెంటవెంటనే జరగడం అన్నది సర్వసాధారణ విషయం. అలాగే ఆలయాల మీద చిన్నచిన్న దాడులు, గ్రామాల్లో చిరు వివాదాలను సైతం కొందరు ఫోన్లో వీడియోలు తీసి లేదా ఫోటోలు పెట్టి విపరీతంగా ప్రభుత్వం మీద ట్రోలింగ్ చేసే అంశం పోలీసు దర్యాప్తులో బయటపడింది. కొన్ని ఉద్దేశ్యపూర్వకంగా జరిగితే మరికొన్ని అదే తరహా ఘటనలను కావాలని పెద్దవి చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో లక్ష్మీ నరసింహ ఆలయం విగ్రహం పగలగొట్టారని చేసిన ప్రచారం కూడా కొత్తదని పోలీసులు విచారణలో వెల్లడైంది. దానిని ప్రచారం చేసిన మీడియా ప్రతినిధుల మీద కేసులు పెట్టారు. ఈ రోజుల్లో చేతిలో సెల్ఫోన్ ఉంటే అది సోషల్ మీడియాలో పెట్టడం.. దాన్ని విపరీతంగా ట్రోల్ చేయడం అనేది చాలా సర్వసాధారణ విషయం అయిపోయింది. ఒక అంశం అనేది ఎంత మంది మనోభావాలను దెబ్బ తీస్తుంది అన్నది ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారం సోషల్ మీడియా వేదికగా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నట్లు చిత్రీకరించే విషయంలో ఏ పార్టీ కార్యకర్తలు ఉన్న దండిడించాలని చెప్పే బాధ్యత ఉన్న ఇరు పార్టీల పెద్దలు… ఎదురు దాడికి దిగడం నిజంగా డీజీపీ చెప్పిన విషయాలకు బలం చేకూర్చేవే.