ఐదేళ్ల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. దేశం కోసం, రాష్ట్ర కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయని మహనీయుల త్యాగాలను గుర్తిస్తూ వారి వారసులను రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించారు. వారికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాలువాలు కప్పారు, జ్ఞాపికలు అందజేశారు. మూడు రోజుల అవతరణ వేడుకలు జరుగనున్నాయి.