iDreamPost
android-app
ios-app

ఆ పురుగు మందులను ఎవ్వరూ కొనొద్దు – వ్యవసాయశాఖ

ఆ పురుగు మందులను ఎవ్వరూ కొనొద్దు – వ్యవసాయశాఖ

మూడు రసాయన పురుగుమందులను పరీక్షించిన వ్యవసాయశాఖ అవి నాసిరకమైనవిగా తేల్చింది. వాటిని రైతులెవరూ కొనడం గాని అమ్మడం కానీ చేయొద్దని ఆదేశాలను జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన వెంకట భద్రయ్య “అజాక్సీస్ట్రోబిన్‌ 11 శాతం ప్లస్‌ టెబుకోనజోల్‌ 18.3 ఎస్‌.పి., ట్రైసైక్లోజోల్‌ 18 శాతం ప్లస్‌ మాంకోజెబ్‌ 62 శాతం డబ్ల్యు.పి, డయాఫోన్‌ తయూరాన్‌ 50 శాతం డబ్ల్యు.పి. అనే మూడు రకాల రసాయన మందులను గుజరాత్‌ ఆగ్రో కెమికల్స్‌ కంపెనీ పేరుతో తయారుచేసి విక్రయిస్తున్నాడు.

ఈ రసాయన మందులను వ్యవసాయ శాఖ రాజేంద్రనగర్‌ ప్రయోగశాలలో పరీక్షించగా నాసిరకం అని తేలడంతో వాటిని రైతులు కొనవద్దని అమ్మవద్దని హెచ్చరించింది. అవి నాసిరకమైనవని అనుమతులు లేకుండా అమ్మకాలు జరుపుతున్నారని వాటిని కొని మోసపోవద్దని రైతులను వ్యవసాయశాఖ హెచ్చరించింది.