iDreamPost
iDreamPost
ప్రభుత్వ సేవలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఉన్న జగన్ ప్రభుత్వం, కార్యాచరణలో ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముందు నుంచి రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలు ఉండకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్ యునైటెడ్ కింగ్ డమ్ తరహాలో పబ్లిక్ పాలసీ ల్యాబ్ ను ఏర్పాటు చేయాలని తద్వార రాష్ట్ర ఆర్ధిక స్థితి చక్కదిద్దడంతో పాటు అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ది చెందేలా చేయాలని చేసిన ఆలోచన మేరకు తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏర్పడిన ఈ పబ్లిక్ పాలసీ ల్యాబ్ ద్వారా ప్రభుత్వ రంగంలో ఉన్న కీలక సమస్యల పరిష్కారంతో పాటు విశాఖ ఆంధ్రప్రదేశ్ కు ప్రధాన ఆర్ధిక వనరుగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తుంది అని అలాగే రాయలసీమ కేంద్రంగా పెటుబడుల ఆకర్షణతో భారీ పరిశ్రమలు తీసుకుని వచ్చి రాష్ట్రం ఆర్ధికంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేలా చేస్తుందని అధ్యయనం, విజ్ఞానం, ప్రణాళిక, పరిశోధన వ్యుహాతమక ఆలోచనలతో రాష్ట్ర అభివృద్ది చేయడంలో కీలక పాత్ర పొషిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం స్పష్టం చేశారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాస్తవ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన అధికారులని ఈ మేరకు మంత్రి గౌతం రెడ్డి అభినందించారు. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం కరోనా వైరస్ మహమ్మరి ఉదృతి తగ్గుముఖం పట్టాక పారిశ్రామిక, నైపుణ్య రంగాల్లో మరింత మెరుగ్గా సంస్కరణలు తీసుకువచ్చి తద్వారా ఉపాధి అవకాశాలు, ఆర్ధిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నట్టు చెప్పుకొచ్చారు.