iDreamPost
android-app
ios-app

అనుష్క కొత్త సినిమా సంగతులు

  • Published Jun 06, 2021 | 8:31 AM Updated Updated Jun 06, 2021 | 8:31 AM
అనుష్క కొత్త సినిమా సంగతులు

భాగమతి తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని మరీ చేసిన నిశ్శబ్దం డైరెక్ట్ ఓటిటి రిలీజ్ లోనూ డిజాస్టర్ కావడంతో నిశ్శబ్దంగా ఉన్న స్వీటీ అనుష్క మళ్ళీ ఇంకే కొత్త సినిమా సంగతులు షేర్ చేసుకోవడం లేదు. కనీసం సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా కనిపించని ఈ అరుంధతి త్వరలోనే మేకప్ వేసుకుని సెట్లోకి అడుగు పెట్టబోతోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ-జాతి రత్నాలు వరస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందబోయే ఎంటర్ టైనర్ లో అనుష్కదే కీలక పాత్ర. అయితే అది తనకు జోడిగానా లేక ఇంకేదైనా ట్విస్ట్ ఉంటుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దీనికి సంబంధించి కొన్ని అప్ డేట్స్ లీక్ అయ్యాయి.

కంప్లీట్ ఫన్ కాన్సెప్ట్ తో రూపొందబోయే ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ని లాక్ చేసే ఛాన్స్ ఉందని ఇన్ సైడ్ టాక్. వినగానే క్యాచీగా అనిపిస్తున్న ఈ టైటిల్ ఇద్దరి ఇమేజ్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా సరిపోతుందని యూనిట్ భావిస్తున్నారట. యువి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అయ్యాక ఆ మేరకు అనౌన్స్ చేసేందుకు ప్లానింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకపక్క తన పెళ్లి వార్తలు ఏ మీడియాలో వచ్చినా స్పందించని అనుష్క కనీసం సినిమాల కబుర్లైనా అభిమానుల కోసం రెగ్యులర్ గా చెప్పుకుంటే బాగుంటుంది

ఇక కథ విషయానికి వస్తే నలభైకి దగ్గరలో ఉండే పెళ్లి కాని అమ్మాయి మీద పాతికేళ్ల అబ్బాయి మనసు పారేసుకుంటే ఎలా ఉంటుందన్న పాయింట్ మీద ఇది రూపొందుతోందని  అంటున్నారు కానీ ఇంకా ఖరారుగా తెలియాల్సి ఉంది. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. అప్పుడెప్పుడో జయసుధ టైటిల్ రోల్ లో ఆంటీ వచ్చి బాగానే ఆడింది. మరి ఇది కూడా అదే తరహాలో ఉంటుందో లేదో చూడాలి. ఈ మూవీ తర్వాత అనుష్క సినిమాలు కంటిన్యూ చేస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు. చాలా సెలెక్టివ్ గా ఉండటంతో ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారు. మరి ఇకనైనా స్పీడ్ పెంచుతుందో లేదో చూడాలి.

marsbahis girişjojobet girişjojobet girişjojobetjojobet girişJOJOBET GİRİŞjojobetjojobet girişgamdomgrandpashabetCasibomjojobet girişholiganbet girişMarsbahis