iDreamPost
android-app
ios-app

రథం నిర్మాణానికి మంత్రుల పూజలు

  • Published Sep 27, 2020 | 8:04 AM Updated Updated Sep 27, 2020 | 8:04 AM
రథం నిర్మాణానికి మంత్రుల పూజలు

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి నూతన రథం నిర్మాణానికి శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. ప్రమాదంలో కాలిపోయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేయడంతో పాటు కొత్త రథాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.

ఇందుకు అనుగుణంగా కలపను కూడా సిద్ధం చేసారు. దీంతో ఆదివారం ఉదయం 11.15 ని.లకు రుత్వికులు నిర్ణయించిన ముహూర్తానికి రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాల కృష్ణ, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ కె. మురళీధర్‌రెడిడ, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాదరావు తదితరులు ప్రత్యేక పూజలు చేసారు.

రథం నిర్మాణానికి ఎటువంటి అవాంతరాలు ఎదురు కాకుండా ఉండాలన్న తలంపుతో వేద పండితుల సమక్షంలో సుదర్శన శాంతిహోమం చేపట్టారు. ఇందులో ఆయా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వయంగా పాల్గొన్నారు. వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో జరగబోయే స్వామివారి కళ్యాణోత్సవాలకు కొత్త రథం సిద్ధం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళుతోందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేసారు.