iDreamPost
iDreamPost
ఇంకా వకీల్ సాబ్ బ్యాలన్స్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ కాలేదు. వచ్చే నెల సెట్లో ప్రవేశించి ఏకధాటిగా రెండు వారాల పాటు పాల్గొని పూర్తి చేయబోతున్నాడు. ఆ షెడ్యూల్ లోనే శృతి హాసన్ కూడా ఉంటుంది. వీటి తర్వాత మరో నాలుగు సినిమాలు పవన్ లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ముందు క్రిష్ దర్శకత్వంలో రూపొందే హిస్టారికల్ మూవీ ఉంటుంది. కొంత భాగం లాక్ డౌన్ కు ముందే షూట్ చేశారు. ఆ తర్వాత హరీష్ శంకర్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. ఆపై సురేందర్ రెడ్డి కూడా క్యూ లో ఉన్నాడు. ఇక్కడితో పవర్ స్టార్ కెరీర్ కౌంట్ 29కు చేరుకుంటుంది. వీటికే సులభంగా మూడు నాలుగేళ్లు పట్టే అవకాశం ఉండగా తాజాగా ఇప్పుడు అయ్యప్పనుం కోషియం రీమేక్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.
రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఎట్టకేలకు పవన్ ని ఒప్పించినట్టుగా సమాచారం. మరో హీరో క్యారెక్టర్ కోసం రానా ఇంతకు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్ ఉంది. అయితే ఇది చాలా రీజనబుల్ బడ్జెట్ లో పూర్తి చేయగలిగే అవకాశం ఉన్న సినిమా. ఏ అరకులోనో పొల్లాచ్చిలోనో లేదా గోదావరి జిల్లాల్లోనో ఈజీగా తీసుకోవచ్చు. క్యాస్టింగ్ కూడా భారీగా అవసరం లేదు. ఆ రెండు పాత్రల మధ్యే ఎక్కువ కథ సాగుతుంది. ఇప్పుడు క్రిష్ కంటే ముందు ఇది చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా జరుగుతోందట. అయితే క్రిష్ మూవీకి పొడవాటి జుట్టు అవసరం. అందుకే చాలా నెలల నుంచే కటింగ్ చేసుకోకుండా అలాగే మైంటైన్ చేస్తున్నాడు పవన్. వకీల్ సాబ్ లో కూడా దాన్నే మేనేజ్ చేశారు.
ఒకవేళ అయ్యప్పనుం కోషియం చేయాలంటే మాత్రం కత్తిరించక తప్పదు. ఎలాగూ క్రిష్ కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పాడు కాబట్టి ఆలోగా ఈజీగా రీమేక్ చేయగలిగే దీన్నే ప్రిఫర్ చేస్తున్నట్టు వినికిడి. దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే వచ్చే నెల దాకా వేచి చూడాల్సిందే. రాజకీయాల్లో ఈ మధ్య పవన్ అంత యాక్టివ్ గా కనిపించని తరుణంలో తన పూర్తి ఫోకస్ సినిమాల మీదే పెట్టబోతున్నాడన్నది స్పష్టం. కానీ ఇప్పుడిక్కడ చెప్పిన వాటిని కమిట్ మెంట్ ప్రకారం మూడేళ్ళలో ఎన్నికలు వచ్చేలోగా చేయగలరా అనేది అనుమానమే. అన్నట్టు అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ కోసం సాగర్ చంద్ర, బాబీ ఇలా ఓ రెండు మూడు పేర్లు పరిశీలనలో పెట్టుకుంది సితార. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే దాకా ఏదీ ఖరారుగా చెప్పలేని పరిస్థితి