iDreamPost
iDreamPost
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయమైన అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆలయంలో 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల్లో 39 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. స్వామివారికి జరిగే నిత్య పూజా కార్యక్రమాలో యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు. అలాగే ఇదే జిల్లాలోని మరో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ లోవ ఆలయాన్ని కూడా ఆది, సోమవారాల్లో మూసివేసి ఉంచుతున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఇక్కడ కూడా దేవస్థానం ఉద్యోగుల్లో పలువురికి పాజిటివ్‌లు వచ్చాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాలో ఈ రెండు దేవాలయాల్లోనూ శ్రావణ మాసంలో భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటారు. ఆషాఢ మాసం తరువాత కొత్త దంపతులు కుటుంబ సమేతంగా ఈ రెండు ఆలయాలను దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే ఈ సారి కరోనా విజంభణ నేపథ్యంలో వారికి దర్శనభాగ్యం నిలిచిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభంలో తక్కువగా ఉన్నా.. ప్రస్తుతం వేగం పుంజుకుంది. ప్రతి రోజు వెయికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో వైరస్ సోకిన వారి సంఖ్య 30 వేల మార్క్‌ను దాటడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.