iDreamPost
iDreamPost
ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకలను విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అధికారికంగా నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ బీబీ హరిచందన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేడుకల మొదటి రోజు హస్తకళలు, చేనేత కళల ప్రదర్శన, రెండో రోజు కూచిపూడి నృత్య ప్రదర్శన, లలిత, జానపద కళల ప్రదర్శనలు, సురభి నాటకాలు ప్రదర్శించబడతాయి. మూడవ రోజు తెలుగు సంప్రదాయలు, ఆహర ఉత్పత్తుల ప్రదర్శన జరగనుంది.