iDreamPost
android-app
ios-app

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కు సతీవియోగం

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కు సతీవియోగం

ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. కొద్ది వారాలుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ(63) మంగళవారం కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఉద్యోగులు సంతాపం తెలియజేశారు. కనకదుర్గ దుర్గ మరణంతో ఆంధ్రజ్యోతి సంస్థల ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

కనకదుర్గ మృతితో వేమూరి రాధాకృష్ణ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆయన కన్నీటి పర్యంతమైనట్లు ఆంధ్రజ్యోతి ఉద్యోగులు తెలిపారు. ఆయన ఆ సంస్థ ఉద్యోగులు ఓదార్చారు.

కష్టకాలంలో రాధాకృష్ణకు తోడుగా..

ఆంధ్రజ్యోతి దినపత్రిక మూతపడిన తర్వాత దాన్ని తిరిగి ప్రారంభించిన వేమూరి రాధాకృష్ణ దాన్ని ఈ స్థితికి తీసుకురావడానికి చాలా శ్రమ పడ్డారు. ఆ సమయంలో ఆయన సతీమణి కనక దుర్గ ఆయనకు తోడుగా నిలిచారు. ఇదే విషయాన్ని వేమూరి రాధాకృష్ణ పలుమార్లు ప్రస్తావించారు .ఇప్పుడు ఆమె మృతి ఆయనకు తీరని లోటు అని చెప్పాలి. ఆమె ఆంధ్రజ్యోతి సంస్థలకు డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఆమె మృతి పట్ల అధికార ,విపక్ష పార్టీల నేతలతో పాటు , జర్నలిస్టులు ,సినీ ప్రముఖులు నివాళి ప్రకటించి,రాధాకృష్ణకు తమ సానుభూతిని తెలిపారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişcasibomMadridbet