‘ప్రజల భాషలో రాష్ట్ర పరిపాలన జరగడం ప్రజాస్వామ్యానికి అవసరం’ అనే ఏకైక ఉద్దేశంతో మనకు భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత దేశ భాషలకు సముచిత స్థానం ఇవ్వడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరగగా అదే సమయంలో తెలుగును పటిష్ట పరిచేలా 1957లో సాహిత్య అకాడమీ, 1968లో తెలుగు అకాడమీ వచ్చాయి. ఇక తెలుగు అకాడమీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. పి.వి.నరసింహారావు దీని వ్యవస్థాపక అధ్యక్షులు కాగా రాష్ట్ర విభజన తరువాత ఈ అకాడమీ విభజనరెండు రాష్ట్రాలకు కొరకరాని కొయ్యగా మారింది. 2014లోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా… తెలుగు అకాడమీ విభజన, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దానిని గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి అవసరం అనుకుంటున్న అన్ని విషయాలను పట్టుబట్టి మరీ సాధించుకుంటున్న ఆయన ఈ విషయం మీద కోర్టు దాకా వెళ్లేలా చేశారు.
నిజానికి ఈ ఏడాది మొదట్లో ఉద్యోగుల పంపకం, ఆస్తులు- అప్పులపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చి, ఇలాంటి వ్యవహారాలకు న్యాయస్థానాల్లోనే పరిష్కారం దొరుకుతుందని పేర్కొంది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయకుండా సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అకాడమీ విభజన అంశం న్యాయ పరిధిలోకి రాదని తన పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ జరిపి తెలుగు అకాడమీ పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాలు చర్చించుకుని నెలరోజుల్లో ఏకాభిప్రాయానికి రావాలని, ఒకవేళ ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అప్పుడు తాము విచారణ చేపడతామని మే నెలలో స్పష్టం చేసింది. అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చిన ఈ కేసు విషయంలో జగన్ సర్కార్ కు బూస్ట్ ఇస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన డబ్బును వారం రోజుల్లో బదిలీ చేయాలని తెలంగాణకు స్పష్టం చేసింది.
నిజానికి గతంలో ఏపీకి అందాల్సిన నిధులు అందేలా చేయాలని ఆదేశాలు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు బదిలీ చేయలేదంటూ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది, ఈ క్రమంలో రెండు వారాల్లో డబ్బులు బదిలీ చేస్తామని, మరికొన్ని డాక్యుమెంట్లు అందజేస్తామని తెలంగాణ తరఫు న్యాయవాది సమయం కోరగా కోర్టు మాత్రం వారం రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. ఇక విభజన చట్టంలో ఉన్న స్థిరాస్తిలో కూడా తమకు వాటా వస్తుందని ఏపీ వాదించగా.. ముందుగా చరాస్తులు, బ్యాంకు నిధుల పంపిణీ అంశాలను పరిష్కరించుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. పేర్కొన్నారు. మరోపక్క అకాడమీ స్థిరాస్తులకు సంబంధించి తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. అంతేకాక తెలుగు అకాడమీ విభజనకు సంబంధించి విశ్రాంత న్యాయమూర్తితో కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేయగా తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది అందుకు అభ్యంతరం తెలిపారు. మొత్తం మీద ఇప్పట్లో తేలదు అన్న అంశాన్ని జగన్ సర్కార్ చేసి చూపెడుతున్న తీరు పట్ల పలువురు భాషాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : రఘురామరాజుకు షాక్ – పిటీషన్ కొట్టివేత