iDreamPost
android-app
ios-app

అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన “ఈఎస్‌ఐ ” స్కాం కథేంటీ?

  • Published Jun 12, 2020 | 5:05 AM Updated Updated Jun 12, 2020 | 5:05 AM
  • Published Jun 12, 2020 | 5:05 AMUpdated Jun 12, 2020 | 5:05 AM
అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన  “ఈఎస్‌ఐ ” స్కాం కథేంటీ?

కార్మిక రాజ్య భీమా సంస్థ (ఈఎస్‌ఐ)లో మందులు, వైద్య పరికరాల్లో వందల కోట్ల రూపాయల కుంభకోణం తెలంగాణాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఏపీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ కుంభకోణం పై విచారణ చేపట్టి దాదాపు 151 కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగినట్లు నిర్థారించింది. 2014 –19 మధ్య ఈ తంతు సాగినట్లు తేల్చింది. ఈ వ్యహారంలో అప్పట్లో రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కీలక పాత్ర ఉండటంతో ఆయనను నేటి ఉదయం ఏసిబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు..

అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫారుసు లేఖ ద్వారా వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు టెండర్లు ఏకుండానే నామినేషన్‌పై సరఫరా చేసేలా కాంట్రాక్టులు ఇవ్వడంతో ఈ దోపిడీ జరిగినట్లు వెల్లడైంది. గత ఐదేళ్లలో కొనుగోలు చేసిన మందుల విలువ 38.58 కోట్ల రూపాయలు కాగా 51.02 కోట్లు అధనంగా చెల్లించారు. వైద్య పరికరాలను నామినేషన్‌పై కొనుగోలు చేశారు. అయితే వాటి వాస్తవ విలువ కన్నా 10.43 కోట్లు అధికంగా చెల్లించారు. ల్యాబ్‌ కిట్‌లలో 85.32 కోట్లు అధికంగా చెల్లించారు. ఫర్నీచర్‌లో 4.63 లక్షలు మింగేసినట్లు తేల్చారు. ఐదేళ్లలో మందుల కొనుగోళ్లకు సగటును 132.30 శాతం అధికంగా చెల్లించారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాజేంద్రనాథ్‌ రెడ్డి అప్పట్లో వెల్లడించారు.

Also Read:అచ్చెన్నాయుడుని కిడ్నాప్ చేసారంట ‌– చంద్రబాబు హంగామా..

తెలంగాణలోని ఈఎస్‌ఐ కుంభకోణంలో ఉన్న సంస్థలే ఇక్కడ ఉన్నట్లు అచ్చెన్నాయుడు సిఫారుసుతో పాటు ఈఎస్‌ఐలోని ఉన్నతాధికారులు ఈ దోపిడీలో ఉన్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలిపింది. ఈఎస్‌ఐ అప్పటి డైరెక్టర్లు డా.బి.రవికుమార్, డా. విజయ్‌కుమార్, ఫార్మసిస్ట్‌ ధనలక్ష్మీ, సీనియర్‌ అసిస్టెంట్‌ ఈ. రమేష్‌బాబు, జాయింట్‌ డైరెక్టర్లు డా. జి. జగదీప్‌గాంధీ, డా. వి. కృష్ణ కుమారి, డా. వి. జనార్థన్, డా. వి. చంద్రశేఖర్, డా. టి. సరళతోపాటు పలువురు డాక్టర్లు, అధికారుల పాత్ర ఉన్నట్టు తేల్చింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet