iDreamPost
android-app
ios-app

jabardasth- anasuya వెకిలి చేష్ట‌లు నాకు న‌చ్చ‌వ్, ఆ ఊబిలో చిక్కుకోవాలనుకోవట్లేదు

  • Published Aug 14, 2022 | 2:49 PM Updated Updated Aug 14, 2022 | 5:29 PM
jabardasth- anasuya వెకిలి చేష్ట‌లు నాకు న‌చ్చ‌వ్, ఆ ఊబిలో చిక్కుకోవాలనుకోవట్లేదు

ఫేమ్ తెచ్చిన జబర్దస్త్ కు అనసూయ ఎందుకు గుడ్‌బై చెప్పింది? మ‌ల్లెమాల‌తో ప‌డ‌లేద‌ని కొంద‌రు, కాదు, ఎమ్మెల్యే రోజా వెళ్లిపోయిన త‌ర్వాత ఇంకెందుకు బైట‌కు వ‌చ్చేసింద‌ని మ‌రికొంద‌రు అన్నారు. కాని తాను ఆ షోను ఎందుకు వీడాల్సి వచ్చిందన్న దానిపై తొలిసారిగా నోరు విప్పింది అనసూయ. ‘దాదాపు రెండేళ్లగా షో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా. చాలా సార్లు నాపై వేసే పంచులు నచ్చక సీరియస్‌గా రియాక్షన్స్‌ ఇచ్చా. బాడీ షేమింగ్‌, వెకిలి చేష్టలు లాంటివి నాకు నచ్చవు. చాలాసార్లు పంచులు నచ్చక, ముఖం మాడ్చుకున్నట్లు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చిన సందర్భాలు ఉన్నా, అవి షోలో వేయరని చెప్పింది

క్రియేటివ్‌ ఫీల్డ్‌ అన్న తర్వాత ఇవన్నీ తప్పవు కానీ, ఆ ఊబిలో చిక్కుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. అందుకే నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. ఒక‌, నాగబాబు, రోజాగారు వెళ్లిపోయారు కాబట్టే నేను కూడా వెళ్లిపోతున్నాన‌న్న‌ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. వాళ్లు వెళ్లిపోయారు కదా అని వెళ్లిపోవడానికి నేనెం గొర్రెల మంద టైప్‌ కాదు. సినిమాలపై ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నా’ అంటూ అన‌సూయ సీరియ‌స్ గా కామెంట్స్ చేసింది.

రెండేళ్ల నుంచి బైట‌కు వ‌ద్దామ‌నుకున్నా ఎందుకు రాలేక‌పోయింది? బ‌హుశా ఎగ్రిమెంట్ స‌మ‌స్య ఉందా? లేదంటే, బైట‌కు వ‌ద్దామ‌నుకున్నా, స‌రైన ఆఫ‌ర్స్ రాలేదా? కామెడీ షో నుంచి బయటకు వచ్చిన త‌ర్వాత‌ అనసూయ కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి.

jojobet girişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetBetvolemarsbahis giriş