iDreamPost
android-app
ios-app

చీప్ ప‌బ్లిసిటీ కోస‌మే, నితిన్ పై అమ్మ రాజశేఖర్ కంట్రోల్ త‌ప్పాడా?

  • Published Jul 12, 2022 | 1:46 PM Updated Updated Jul 12, 2022 | 1:46 PM
చీప్ ప‌బ్లిసిటీ కోస‌మే, నితిన్ పై అమ్మ రాజశేఖర్ కంట్రోల్ త‌ప్పాడా?

దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ త‌న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. వ‌స్తాన‌ని చెప్పి ఈవెంట్ కు రాలేద‌ని, నితిన్ మీద‌ అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యాడు. కంట్రోల్ త‌ప్పాడు. టక్కరి సినిమాలో నితిన్‌కి డ్యాన్స్‌లు నేర్పించా, అత‌ని కెరీర్ కి ప్రాణం పోశాన‌ని కామెంట్ చేయడ‌మేకాదు, త‌న‌ను త‌ను అత‌నికి గురువుగా చెప్పుకున్నాడు. అమ్మ రాజశేఖర్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు క‌నిపిస్తున్నాయి.

నితిన్‌కి డ్యాన్స్‌లు నేర్పిస్తే, అది కొరియోగ్రాఫర్‌గా అత‌ని ప‌ని. దానికి రెమ్యునిరేష‌న్ కూడా తీసుకొంటాడు. దీనికితోడు టక్కరి డిజాస్టర్‌. అస‌లు, నితిన్ తన మొదటి సినిమా నుంచే డ్యాన్సర్ అని ఇండ‌స్ట్రీ అంటోంది. మ‌రి హీరోకి ప్ర‌త్యేకంగా డాన్స్ లో ట్ర‌యినింగ్ ఇవ్వ‌డం ఏంటి?

నితిన్‌ను చీఫ్ గెస్ట్‌గా పెట్టి పోస్టర్‌ని కూడా పంపాడు డైరెక్ట‌ర్ అమ్మ‌రాజ‌శేఖ‌ర్. మాచర్ల నియోజక‌వ‌ర్గం ప్రమోషన్‌ల కారణంగా పోస్టర్‌ని విడుదల చేయలేదని హీరో క్లియ‌ర్ గా చెప్పాడు. అయినా,
తన సినిమాకు కొంత చీప్ పబ్లిసిటీ కోసమే, అమ్మ రాజశేఖ‌ర్ ట్రైచేశాడ‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఒకప్పుడు డాన్స్ మాస్టర్ గా అమ్మ రాజశేఖర్ కున్న పేరు తెలిసిందే. తర్వాత దర్శకుడిగా గోపిచంద్ రణంతో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న ట్రాక్ రికార్డు ఆయనది. కాకపోతే దాన్ని ఆ తర్వాత నిలబెట్టుకోలేకపోయారు. బిగ్ బాస్ షోకు వచ్చాక టీవీ ప్రేక్షకుల్లో అంతో ఇంతో గుర్తింపు ఉన్న అమ్మ రాజశేఖర్ అడపాదడపా సినిమాలు డైరెక్ట్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా చేసిన మూవీ హైయ్ ఫైవ్.

దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ వేదికగా అమ్మ రాజశేఖర్ హీరో నితిన్ మీద విమర్శల వర్షం గుప్పించారు. పది రోజుల క్రితం వేడుకకు రమ్మని ఆహ్వానిస్తే ముందు వస్తానని చెప్పి లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇవ్వడమేంటని స్టేజి మీద నిలదీశారు. అతనికి డాన్స్ రాని రోజుల్లో నేర్పించానన్న కృతజ్ఞత లేకుండా గురువుని మర్చిపోవడం అన్యాయమని కాస్త ఘాటుగానే క్లాస్ తీసుకున్నారు రాజశేఖర్.

తెరవెనుక ఏం జరిగిందో కానీ ఇప్పుడీ కామెంట్స్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అన్నట్టు ఈ హైయ్ ఫైవ్ కి సంగీతం తమన్ సమకూర్చారు. ఎన్నడూ దీని గురించి మాట్లాడని తమన్ ఎప్పుడు మ్యూజిక్ ఇచ్చాడాని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ గొడవ సంగతి ఎలా ఉన్నా 22న విడుదల కాబోతున్న జీరో బజ్ ఉన్న ఈ చిన్న సినిమా గురించి కనీసం జనానికి తెలిసి వచ్చింది.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş