కరోనాను జయించిన అమిత్ షాకు మరోసారి శ్వాస సంబంధ సమస్యలు తిరగబెట్టడంతో ఎయిమ్స్‌లో చేరినట్టు సమాచారం. ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోయినా శనివారం రాత్రి 11 గంటలకు ఆయన ఎయిమ్స్‌లో చేరినట్టు తెలుస్తుంది.
కాగా అమిత్ షాకు ఆగస్టు 2 న కరోనా పాజిటివ్ అని నిర్దారణ కాగా కరోనాతో పోరాడి తిరిగి కోలుకున్నారు. ఆగస్టు 14 న అమిత్ షాకు నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ అని రావడంతో ఆయనను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. కానీ నాలుగు రోజుల తర్వాత మరోసారి శ్వాస కోస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడటంతో ఆగస్టు 18న ఎయిమ్స్ పోస్ట్-కోవిడ్ కేర్ సెంటర్‌లో చేరి రెండువారాల చికిత్స అనంతరం ఆగస్టు 31న డిశ్చార్జ్ అయ్యారు.
కానీ మరోసారి శ్వాసకు సంబంధించిన సమస్యలు తిరగబెట్టడంతో శనివారం రాత్రి 11.00 గంటల ప్రాంతంలో ఎయిమ్స్ కార్డియాక్ న్యూరో టవర్‌లో చేరినట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ప్రస్తుతం ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతుందని తెలుస్తుంది. కాగా ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు..