iDreamPost
android-app
ios-app

టిక్‌టాక్‌ స్టార్‌ అనుమానాస్పద స్థితి..

  • Published Jun 12, 2022 | 8:30 PM Updated Updated Jun 12, 2022 | 8:30 PM
టిక్‌టాక్‌ స్టార్‌ అనుమానాస్పద స్థితి..

అమెరికన్‌ టిక్‌టాక్‌ స్టార్‌ కూపర్‌ నోరిగ(19) తాజాగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అమెరికన్‌ టిక్‌టాక్‌ స్టార్‌ కూపర్‌కు టిక్‌టాక్‌లో 1.77 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. ఫన్నీ స్కేట్‌ బోర్డింగ్‌ వీడియోలు, ఫ్యాషన్‌ వీడియోలు టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసి ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు కూపర్‌.

అయితే కొంతకాలంగా కూపర్‌ ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 5న టిక్‌టాక్‌లో అతడు ఓ వీడియో షేర్‌ చేస్తూ.. మీ సాదకబాధకాలను నాతో చెప్పుకోండి. ఎందుకంటే మానసిక ఒత్తిడి మనల్ని ఎంతగా బాధిస్తుందనేది నాకు తెలుసు, మీరు ఒంటరి కాదు. మీకు నేనున్నాను అని తెలిపాడు.

తాజాగా లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ మాల్‌లో పార్కింగ్‌ దగ్గర శవమై కనిపించాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అతడు మృతి చెందడానికి కొన్ని గంటల క్రితం సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. అందులో కూపర్ బెడ్‌పై పడుకొని.. యుక్త వయసులోనే చనిపోతామేమో అని ఎవరు ఆలోచిస్తున్నారు అని ఫ్యాన్స్‌ను ఉద్దేశించి అడిగాడు. ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది గంటలకే అతడు మరణించడం గమనార్హం.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişJojobet Güncel GirişMarsbahisJojobetHoliganbet