iDreamPost
android-app
ios-app

భూమి అంటే భువనేశ్వరికి ఎంత ప్రేమ

భూమి అంటే భువనేశ్వరికి ఎంత ప్రేమ

రాజధానిపై చంద్రబాబు కుటుంబం డ్రామాలు ఆడుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. విజయవాడలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

‘‘ చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు పంటలు పండగ, అప్పుల పాలై చనిపోతే భువనేశ్వరికి కలగలేదు. పుష్కరాల్లో 29 మంది చనిపోతే వారి కుటుంబాలపై జాలీ కలగలేదు. కన్నతండ్రి తన అల్లుడు వెన్నుపోటు పొడిచాడని రాష్ట్రమంతా తిరిగి తన బాధను వ్యక్తం చేస్తే కూతురైన భువనేశ్వరికి కనీసం జాలి కలగలేదు.

కానీ రాజధాని ప్రాంత రైతులపై ప్రేమతో ప్లాటినం ఇచ్చారు. ఎప్పుడూ లేనిది ప్లాటినం గాజు ఇవ్వడం వెనుక కారణం ఏమిటి..? రాజధానిపై మీభర్త, మీ పుత్రుడు, మీ పారీ వారు కొన్న 4070 ఎకరాలు కాపాడుకోవడానికేనా అమరావతి రైతులపై జాలి. చంద్రబాబును నమ్మొద్దని రైతులకు’’ అంబటి విజ్జప్తి చేశారు.