iDreamPost
android-app
ios-app

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కృష్ణారెడ్డి

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కృష్ణారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం మరో సలహాదారుడును నియమించింది. కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డి వ్యవసాయ సలహాదారుడుగా సేవలు అందించనున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామానికి చెందిన అంబటి కృష్ణారెడ్డి వైఎస్‌ కుటుంబానికి అనుచరుడుగా ఉన్నారు. వైసీపీకి ఆది నుంచి అండగా ఉన్నారు. వైసీపీ తరఫున ఆయన తిప్పలూరు సర్పంచ్‌గా, ఆయన భార్య అంబటి పార్వతమ్మ ఎంపీటీసీగా సేవలందించారు.

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుని పదవిలో కృష్ణా రెడ్డి 2 సంవత్సరాలు లేదా ఎంత వరకు అవసరం అని ప్రభుత్వం అనుకుంటే అంత వరకూ కొనసాగవచ్చు. కేబినెట్‌ ర్యాంకుతో కృష్ణారెడ్డిని సలహాదారునిగా నియమిస్తూ సాధారణ పరిపాలన ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్వర్వులు జారీ చేశారు. కాగా. రెండు రోజుల క్రితం ప్రజా విధానం సలహాదారుడుగా ఉన్న కె.రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.