iDreamPost
iDreamPost
రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాజధాని పేరిట భారీస్థాయిలో భూ కుంభకోణానికి తెరలేపిన విషయం ఇప్పటికే అధికారుల దర్యాప్తులో తేటతెల్లం అయింది . ఈ మేరకు అరెస్టులు కూడా జరిగాయి. విభజనలో పూర్తిగా అర్ధికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని దాని ఆర్ధిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా రాజధాని అమరావతి అంటూ లక్షల కోట్ల ప్రాజెక్టు అంటూ మొదలు పెట్టి ఐదు ఏళ్ళ పాలన కాలంలో ఒక్క శాస్వత భవనం కూడా పూర్తిగా నిర్మించకుండా భూ పందారాల మీద మాత్రమే దృష్టి పెట్టి తీరా అధికారంలో కోల్పోయాక అమరావతి అదొక అద్బుత నగరం అంటూ మీడియాలో ప్రచార హోరు అందుకున్నారు తెలుగుదేశం నేతలు.
ఇది ఇలా ఉంటే 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి , అలాగే ప్రాంతాల అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని ప్రజాధాన్ని మొత్తం ఒకేచోట రాజధాని పేరిట ఖర్చు చేయడం వ్యర్ధంగా భావించి, రాష్ట్రంలో అమరావతితో పాటు వెనకపడిన ప్రాంతాలయిన ఉత్తరాంద్ర , రాయలసీమను సైతం సమాంతరంగా అభివృద్ది పధంలో నడిపించాలనే ఆలోచన చేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీంతో ఒక్క శాశ్వత కట్టడం కూడా పూర్తి కాని అమరావతి ప్రాంతానికి జగన్ అన్యాయం చేస్తున్నాడు అంటు వారి మద్దతు దార్లతో రాజధాని రైతుల పేరిట ఉద్యమ నాటకానికి తెరలేపారు తెలుగుదేశం వారు. రైతుల పేరిట ఉద్యమం ప్రదర్శన చేస్తున్న వారిని చూపుతూ ఏడాదిగా రైతుల ఆందోళనగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య ఒక అడుగు ముందుకు వేసి అమరావతిని నిర్వీర్యం చేసేందుకే మూడు రాజధానుల నిర్ణయం అంటూ ఏడాదిగా ఉద్యమం చేస్తున్న రైతులతో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారీ చర్చలు జరపలేదు అంటూ సత్య దూరమైన మాటలను మాట్లాడి అధినాయకుడి మెప్పు పొందే ప్రయత్నం చేశారు.
వర్ల రామయ్య చెప్పినట్టు నిజంగానే జగన్ అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారా , రైతులతో చర్చించలేదా అని పరిశీలిస్తే తెలుగుదేశం కపట నీతి మరోసారి బయటపడుతుంది. నిజానికి తెలుగుదేశం అమరావతి ప్రాంతంలో పచ్చగా మూడు పంటలు పండే రైతుల పొలాలు గుంజుకుని వాటిని బీడుగా మార్చి ఆ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసింది. ఇక జగన్ రాజధాని రైతులతో ఒక్కసారి కూడా సంప్రదించలేదు అని చెబుతున్న వర్ల రామయ్యకు గడిచిన ఫిబ్రవరి నెలలో రాజధాని రైతులతో జగన్ తన క్యాంపు కార్యాలయంలో భేటి అయి వారికి భరోసా కల్పించడం , భేటి తదనంతరం రైతులు మీడియా ముందుకు వచ్చి సీఏం జగన్ నిర్ణయాన్ని స్వాగతించడం జరిగింది. ఈ మోత్తం వ్యవహారం కనిపించనట్టు నట్టించడం రామయ్యకే చెల్లింది.
జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్ ని సవరించి రూ.2500 గా ఉన్న పెన్షన్ ని రూ.5000కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూములిచ్చిన పట్టా రైతులతో సమానంగా అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి కూడా రిటర్న్ ప్లాట్ల కేటాయింపు, అసైన్డ్ భూముల రైతులకు 1000 గజాల నివాస స్థలం కేటాయింపు, అసైన్డ్ భూముల రైతులకు 250 గజాల వాణిజ్య స్థలం కేటాయింపు, గతంలో జరీబు భూముల రైతులకు ఏటా కౌలు కింద రూ.50వేలు చెల్లించేవారు. దాన్ని ప్రస్తుతం రూ.55వేలకు పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో మెట్ట భూములకు రూ.30వేలు చెల్లించేవారు. దాన్ని రూ.33 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయంచింది. గతంలో రైతులకు కౌలు పదేళ్లు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, జగన్ ప్రభుత్వం దాన్ని 15 సంవత్సరాల పాటు ఇవ్వాలని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇలా రైతులకు అన్ని విధలుగా మేలు కలిగేలా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే , రైతులు పేరిట భూములపై రియలెస్టేటు వ్యాపారం చేసే వారిని రైతులుగా చిత్రీకరించి ఇప్పటి ప్రభుత్వం పై వర్ల రామయ్య లాంటి నేతలు నిందలు మోపే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం.