సంక్రాంతి బరిలో పోటాపోటీగా దిగిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ దాదాపుగా ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది. ఒకటి రెండు షోలతో అక్కడక్కడా తప్పించి అన్ని చోట్లా సెలవు తీసుకుంది. ఇంకో వారం రోజుల్లో సన్ నెక్స్ట్ లో ఓటిటి ప్రీమియర్ కూడా జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో దీనికి వచ్చిన వసూళ్లను గమనిస్తే పండగ పుణ్యమాని డబుల్ డిజాస్టర్ ముద్ర నుంచి తప్పించుకుని ఫ్లాప్ స్టాంప్ తో సరిపెట్టుకుంది. థియేట్రికల్ బిజినెస్ తో పోల్చుకుంటే సుమారు రెండున్నర కోట్లకు పైగా నష్టాన్నే మిగిల్చింది. ఒకవేళ సోలోగా వచ్చి ఉంటే ఈ డ్యామేజ్ రెట్టింపు ఉండేదన్న మాట వాస్తవం.
ఫైనల్ షేర్ లో అత్యధికం నైజామ్ నుంచే రావడం గమనార్హం. రెండు కోట్ల ఇరవై మూడు లక్షలతో అక్కడ బాగానే రాబట్టుకుంది. అతి తక్కువగా నెల్లూరు నుంచి కేవలం 27 లక్షలు మాత్రమే తెచ్చుకుంది. ఓవర్సీస్ , రెస్ట్ అఫ్ ఇండియాలో మరీ దారుణమైన ఫిగర్లు వచ్చాయి. మాస్ పేరుతో అర్థం లేని కంటెంట్ ని ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నం చేసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దానికి తగ్గ ఫలితాన్నే అందుకున్నాడు. విపరీతమైన ప్రమోషన్లతో తమ సినిమా హిట్టు హిట్టు అని ఎంత చెప్పుకున్నా ఫైనల్ గా ప్రేక్షకులు మాత్రం ఇది కనీసం వన్ టైం వాచ్ కూడా కాదని తేల్చేశారు. ఏరియాల వారీగా లెక్కలు ఈ విధంగా ఉన్నాయి
అల్లుడు అదుర్స్ ఫుల్ రన్ వసూళ్లు:
ఏరియా | షేర్ |
నైజాం | 2.23cr |
సీడెడ్ | 1.43cr |
ఉత్తరాంధ్ర | 1.55cr |
గుంటూరు | 0.59cr |
క్రిష్ణ | 0.34cr |
ఈస్ట్ గోదావరి | 0.60cr |
వెస్ట్ గోదావరి | 0.54cr |
నెల్లూరు | 0.27cr |
ఆంధ్ర+తెలంగాణా | 7.55cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.18cr |
ఓవర్సీస్ | 0.05cr |
ప్రపంచవ్యాప్తంగా | 7.78cr |
అల్లుడు అదుర్స్ కు జరిగిన థియేట్రికల్ బిజినెస్ తొమ్మిదిన్నర కోట్లకు పైమాటే. ఆ లెక్కన చూస్తే మూడు కోట్ల దాకా నష్టం తప్పలేదు. మిగిలిన సంక్రాంతి సినిమాలన్నీ టాక్ తో సంబంధం లేకుండా డిస్ట్రిబ్యూటర్లలు లాభాలు ఇచ్చాయి. ఆఖరికి మాస్టర్ కూడా సేఫ్ గేమ్ అయ్యింది. కానీ అల్లుడు అదుర్స్ మాత్రం కనీసం వాటి అంచులకు కూడా వెళ్ళలేదు. నభ నటేష్ గ్లామర్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, ప్రకాష్ రాజ్ విలనీ, భారీ తారాగణం, ఖరీదైన సెట్లలో పాటల చిత్రీకరణ ఇలాంటి హంగులు ఎన్ని ఉన్నా మినిమమ్ కంటెంట్ లేనప్పుడు ఏ సినిమాకైనా ఇదే ఫలితం తప్పదు
Verdict: Flop