iDreamPost
android-app
ios-app

న్యాచురల్ స్టార్ వైపే అందరి చూపు

  • Published Apr 11, 2021 | 7:36 AM Updated Updated Apr 11, 2021 | 7:36 AM
న్యాచురల్ స్టార్ వైపే అందరి చూపు

16న రావాల్సిన లవ్ స్టోరీ వాయిదా పడటంతో ఓ నాలుగైదు చిన్నా చితక సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులో వర్మ దెయ్యం కూడా ఉంది. అయితే వీటికి కనీస ఓపెనింగ్స్ ఆశించడం కూడా అత్యాశే. అందుకే వకీల్ సాబ్ కు ఊహించని విధంగా మరో అదనపు వారం దొరికినట్టే. ఇప్పటికే యాభై కోట్ల షేర్ కు దగ్గరగా ఉన్న పవన్ మూవీ ఇదే రన్ ని ఇంకో పది రోజులు కొనసాగిస్తే బయ్యర్లు ఈజీగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతారు. లవ్ స్టోరీ కోసం అట్టిపెట్టిన స్క్రీన్లలో అధిక శాతం మళ్ళీ వకీల్ సాబ్ కే వెళ్ళబోతున్నాయి. బ్యాలన్స్ ఉన్నవాటిని ఆ రోజు రిలీజ్ కాబోయేవి పంచుకుంటాయి. థియేటర్లు దొరుకుతాయి కానీ వాటికి జనం రావడమే అనుమానం.

ఇక 23కి ప్లాన్ చేసిన న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీశ్ వైపే ఇప్పుడు ట్రేడ్ తో సహా అందరి చూపు ఉంది. ఇది కూడా వాయిదా పడుతుందా లేక నిర్మాతలు ధైర్యం చేస్తారా అనేదే అంతుచిక్కడం లేదు. తెలంగాణ ఆంధ్రలో మళ్ళీ 50 శాతం ఆక్యుపెన్సీ వస్తుందనే వార్తల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు సైతం ఖంగారు పడుతున్నారు. ఒకవేళ నిజమైనా కూడా టక్ జగదీశ్ రావడమే మంచిదని మెజారిటీ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఎలాగూ అదే రోజు రావాల్సిన కంగనా రౌనత్ తలైవి పోస్ట్ పోన్ అయ్యింది కాబట్టి కర్ణాటక, తమిళనాడులో ఇంకా మంచి రిలీజ్ దక్కుతుంది. ఇది టక్ జగదీశ్ కు హెల్ప్ అయ్యేదే.

కాకపోతే టక్ జగదీష్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో ఆ వర్గం ఆడియన్స్ థియేటర్ కు రావడం చాలా ముఖ్యం. బయట చూస్తేనేమో తల్లితండ్రులు పిల్లలతో సహా హాలుకు వచ్చేందుకు అంత సుముఖంగా లేరేమో అన్న కామెంట్ వినిపిస్తోంది. కానీ ఇది ఎంత వరకు నిజమో ప్రాక్టికల్ గా వకీల్ సాబ్ కు వస్తున్న కలెక్షన్లను చూస్తే అర్థమవుతుంది. జనం అయితే వస్తున్నారు. ఒకవేళ టక్ జగదీశ్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే క్రాక్  తరహాలో ఈజీగా లాభాలతో గట్టెక్కవచ్చు. మరోపక్క లాక్ డౌన్ లు, కర్ఫ్యూలకు ఏమి ఉండవని మంత్రులైతే చెబుతున్నారు. మరి టక్ జగదీశ్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి