iDreamPost
android-app
ios-app

డిజిటల్ డెబ్యూకి రికార్డుల వెల్కమ్

  • Published Jun 03, 2021 | 6:45 AM Updated Updated Jun 03, 2021 | 6:45 AM
డిజిటల్ డెబ్యూకి రికార్డుల వెల్కమ్

ఇటీవలి కాలంలో ఏ వెబ్ సిరీస్ కు రానంత హైప్ తెచ్చుకున్న ఫ్యామిలీ మ్యాన్ 2 అఫీషియల్ స్ట్రీమింగ్ రేపటి నుంచే అయినప్పటికీ ఇవాళ అర్ధరాత్రి లేదా అంతకు రెండు గంటల ముందే ప్రత్యక్షమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడీ టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. తమిళనాడు వర్గాల నుంచి వచ్చిన నిరసన కారణంగా ప్రమోషన్ ని అమాంతం తగ్గించేసిన అమెజాన్ ప్రైమ్ రిలీజయ్యాక వచ్చే స్పందన బట్టి పబ్లిసిటీని అమాంతం పెంచేందుకు పక్కా ప్లానింగ్ తో సిద్ధంగా ఉంది. మరోవైపు సమంతా పోషించిన క్యారెక్టర్ మీదే అందరి చూపు ఉంది. ఎల్టిటిఈ వర్గాలను టెర్రరిస్టులగా చూపించారని ఇప్పటికే అనుమానాలు నెలకొన్నాయి.

ఫ్యామిలీ మ్యాన్ 2కి ఇప్పటిదాకా మొదటి రోజు ఏ ఇండియన్ వెబ్ సిరీస్ రానంత భారీగా వ్యూస్ రావడం ఖాయం. ఒకవేళ ఏదైనా మనోభావాలు దెబ్బ తినే కంటెంట్ ఉంటే తీసేయడమో లేదా డిలీట్ చేయడమో జరుగుతుంది కనక నిద్ర మేల్కొని మరీ మొత్తం సీజన్ 2ని ఒకే ఫ్లోలో చూసేందుకు సిద్ధపడిన అభిమానులు లక్షల్లో ఉన్నారు. పైగా దీనికి అడల్ట్స్ అనే ట్యాగ్ పెట్టడంతో ఆసక్తి ఇంకాస్త రెట్టింపు అవుతోంది. సమంతా మాత్రం సైలెంట్ గా రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తోంది. ఏది చెప్పినా అనవసరమైన ప్రచారానికి దారి తీస్తోంది కాబట్టి ప్రస్తుతానికి మౌనాన్ని ఆశ్రయించి మంచి పనే చేసింది. మరోవైపు షేమ్ ఆన్ సమంతా అనే ట్యాగ్ ని తమిళవాసులు ట్రెండింగ్ లోకి తేవడం కొత్త ట్విస్ట్

ఒకవేళ ఈ సిరీస్ కనక అంచనాలు అందుకుంటే స్టార్లతో భారీ ఎత్తున ఇలాంటి నిర్మాణాలు పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే తమన్నా, కాజల్ అగర్వాల్, శృతి హాసన్, సాయి పల్లవి, రాశి ఖన్నాలు వెబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరుణంలో వాళ్ళందరిని మించిన హైప్ సమంతాకు ఒక్క ఫ్యామిలీ మ్యాన్ 2 తోనే వచ్చేసింది. కాకపోతే అంచనాలు నిలబెట్టుకోవాలి. గతంలో ఇదే తరహాలో సెక్రేడ్ గేమ్స్ సీక్వెల్ భారీ ఎత్తున బజ్ మోసుకొచ్చి దాన్ని అందుకోలేక ఫ్లాప్ అయ్యింది. ఫ్యామిలీ మ్యాన్ 2కి ఆలా జరగకూడదనే అభిమానుల కోరిక. మరి ఈ సస్పెన్స్ కి ఇంకొద్ది గంటల్లో బ్రేక్ పడనుంది.