iDreamPost
android-app
ios-app

ఇటు అలియా అటు ఒలివియా

  • Published Jul 19, 2020 | 5:44 AM Updated Updated Jul 19, 2020 | 5:44 AM
ఇటు అలియా అటు ఒలివియా

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి ఎప్పుడు మొదలవుతుందో అని ఎదురు చూస్తున్నారు ఇద్దరు హీరోల అభిమానులు. వచ్చే జనవరికి రిలీజ్ చేసే అవకాశాలు దాదాపు జీరో అయిపోయాయి. కరోనా కేసులు తగ్గని నేపధ్యంలో తిరిగి ఎప్పటి నుంచి షూట్ మొదలుపెట్టాలో జక్కన్నకే అర్థం కావడం లేదు. జాగ్రత్తలు తీసుకుని తక్కువ సభ్యులతో చేసే వ్యవహారం కాకపోవడంతో ఇంకో నెలా రెండు నెలలు వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు. మరోపక్క పూర్తైన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. దీని సంగతలా ఉంచితే ఇప్పుడీ ఆర్ఆర్ఆర్ వేగంగా పూర్తి చేసే భారం తారక్ చరణ్ లతో పాటు హీరొయిన్ల మీద కూడా ఉంది.

రామ్ చరణ్ కు జోడిగా ఫిక్సైన అలియా భట్ ఇంకా సెట్ లో అడుగు పెట్టనే లేదు. నిడివి పరంగా తన పాత్ర చిన్నదే కాని చాలా కీలకమైంది. అందుకే ప్రత్యేకంగా బెస్ట్ పెర్ఫార్మర్ కావాలని ఏరికోరి మరీ అలియాను తీసుకున్నారు. తను ఇంకా బ్రహ్మాస్త్ర లో కూడా పాల్గొనాల్సి ఉంది. అది కూడా ఆర్ఆర్ఆర్ తరహాలోనే భారీ ఎత్తున స్టార్లతో నిర్మిస్తున్న విజువల్ వండర్. ముందు దానికి డిసెంబర్ విడుదల అనుకున్నారు కానీ ఆ అవకాశమూ పోయింది. ఇక తారక్ కు జంటగా తీసుకున్న ఒలివియా కూడా విదేశాల నుంచి రావాల్సి ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. తను రావడం అంత సులభం కాదు. లవ్ ట్రాక్ తో పాటు ఒక పాట కూడా తీయాల్సి ఉందట.

బ్రిటిష్ సంతతికి చెందినా కొమరం భీమ్ శౌర్యత్వానికి మనసు పారేసుకునే పాత్రలో ఒలివియాకు బాగానే ప్రాధాన్యం ఇచ్చారట. సో అలియా, ఒలివియాలు ఎప్పుడు వస్తారు అనే దాన్ని బట్టి ఆర్ఆర్ఆర్ ప్లానింగ్ ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తయ్యిందని తెలుస్తున్న ఆర్ఆర్ఆర్ మిగిలిన బాలన్స్ లోనే ఇద్దరు హీరొయిన్ల ట్రాక్స్ ఉన్నాయని చెప్పడం విశేషం. అంటే రెగ్యులర్ గా చరణ్ తారక్ సినిమాల్లో ;లభించే స్పేస్ వీళ్ళకు దక్కదన్న మాట. సాయి మాధవ్ బుర్ర సంభాషణలు సమకూరుస్తున్న ఆర్ఆర్ఆర్ కు కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవాల్సి వస్తోంది కాబట్టి ఆర్ఆర్ఆర్ 2021 సమ్మర్ కు షిఫ్ట్ అయిపోయి బాహుబలి సెంటిమెంట్ ని ఫాలో కావడం తప్ప వేరే ఆప్షన్ లేదు