iDreamPost
android-app
ios-app

మద్యం షాప్ కి మందు బాబు పూజ.. కొబ్బరికాయ కొట్టి ఆ పై ఏం చేశాడంటే..

మద్యం షాప్ కి మందు బాబు పూజ.. కొబ్బరికాయ కొట్టి ఆ పై ఏం చేశాడంటే..

చుక్క పడితే గానీ రోజు ప్రారంభమైన కొంత మంది మందుబాబులకు లాక్ డౌన్ చుక్కలు చూపించింది. 40 రోజులుగా మద్యం లేక నరకయాతన చూశారు. పెగ్గు లేక పాలుపోక అయోమయంలో పడ్డారు. వింత వింతగా ప్రవర్తించారు. రోజు ఒక యుగంలా గడిపారు. లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తి వేస్తారా, మద్యం షాపులు ఎప్పుడూ తెరుచుకుంటాయా అని వేయికళ్ళతో ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ రోజు నుంచి మద్యం షాపులు తెరుచుకోనుండడంతో మందుబాబుల ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే..అంటూ డ్యూయెట్లు పాడుతున్నారు.

దుకాణాల వద్ద ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉంటుందన్న అంచనాతో ఉదయాన్నే షాపుల వద్ద బారులు తీరారు. అంతేకాదు కర్ణాటకలో ఓ మద్యం దుకాణం వద్ద ఓ మందుబాబు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మందుబాబు మద్యం దుకాణానికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఆపై హారతులు కూడా ఇచ్చారు. దేవుడికి కొబ్బరికాయ కొట్టాడో లేదో తెలియదు కానీ.. ఈ మందు బాబు మద్యం దుకాణానికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడంతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మద్యం షాపునే దేవాలయంగా భవించినట్లుగా ఉన్నాడు ఆ మందుబాబు. ఈ ఘటన చుట్టుపక్కల వారిలో నవ్వులు పూయించింది. కర్ణాటకలోని బంగారుపేట తాలూకు బుద్ధి కోటలో ఉన్న ఓ మద్యం షాపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 40 రోజులుగా మద్యం షాపు ఎప్పుడు తెరుస్తారా అన్ని ఆ మందు బాబు ఎంతగా వేచి చూశాడు ఈ ఘటన అద్దం పడుతోంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş