iDreamPost
iDreamPost
పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు దాటి ఇంకా నాలుగో సినిమా విడుదల దగ్గరే ఉన్న అక్కినేని మూడో తరం రెండో వారసుడు ఎట్టకేలకు ఓ సూపర్ కాంబినేషన్ ని సెట్ చేసుకున్నాడు. ఇప్పటిదాకా తన వయసు రిత్యా కేవలం ప్రేమకథలను మాత్రమే చేస్తూ వచ్చిన అఖిల్ మొదటిసారి మాస్ దర్శకుడితో లాక్ అయ్యాడు. సైరా తర్వాత పది నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డితో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర దీన్ని నిర్మించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మొదటిసారి అఖిల్ కు మ్యూజిక్ ఇవ్వబోతున్నారని వినికిడి కానీ ఇందులో ప్రకటించలేదు. సుమారు 40 కోట్లకు పైగా బడ్జెట్ తో ఇది రూపొందనుందని ఫిలిం నగర్ టాక్.
సరిలేరు నీకెవ్వరు తర్వాత ఇటీవలే శర్వానంద్ తో మహాసముద్రం అనౌన్స్ చేసిన ఏకే సంస్థ మూడు రోజులకే ఈ కొత్త ప్రకటన ఇవ్వడం విశేషం. నిన్న చెప్పినట్టుగానే 9వ తేదీ ఉదయం 9 గంటల 9 నిమిషాల 9 సెకండ్లకు ఈ అఫీషియల్ నోట్ ఇవ్వడం గమనార్హం. దీనికే ఇంత హంగామానా అనుకోకండి. కరోనా వల్ల కొత్త సినిమాల ప్రకటనలు రావడమే అపురూపమయ్యింది కాబట్టి ఇది స్పెషల్ న్యూస్ గానే చెప్పాలి. అయితే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ 29కి కూడా కమిట్ అయ్యాడు. దానికన్నా ముందు పవర్ స్టార్ మూడు సినిమాలు చేయాల్సి ఉంది కాబట్టి ఆ గ్యాప్ లో సూరి అఖిల్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాడు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది డిఫరెంట్ స్కైఫై థ్రిలర్ గా ఉంటుందట. సూరి మార్క్ హీరోయిజంతో పాటు ప్రేక్షకులు ఊహించని ఎన్నో థ్రిల్స్ ఇందులో ఉంటాయని తెలిసింది. దర్శకుడు సురేందర్ రెడ్డికి సూపర్ హిట్ కథలు అందించిన వక్కంతం వంశీ దీనికి స్టొరీని ఇవ్వడం విశేషం. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పూర్తి చేయాలి. ఎక్కువ బ్యాలన్స్ లేదు కాబట్టి త్వరగానే పూర్తవుతుంది. అది అవ్వగానే సురేందర్ రెడ్డి మూవీ సెట్స్ పైకి వెళ్ళిపోతుంది. తమ హీరోకు పెద్ద బ్రేక్ రావాలని కోరుకుంటున్న అభిమానులను ఈసారి అఖిల్ ఎలా సంతృప్తిపరచనున్నాడో. లెట్ వెయిట్ అండ్ సీ.