ఆకాశవాణి పెద్దయ్యగా రైతుల పెద్దన్నగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న విజయ్ కుమార్ ఈరోజు పదవీవిరమణ చేయనున్నారు. 32 సంవత్సరాల తన ఆకాశవాణి ప్రయాణంలో రైతుల ఆప్త మిత్రుడిగా మారి , పొలం పనులు,పాడి పంట,వ్యవసాయ సూచనలు, ఇల్లు వాకిలిలాంటి ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా తన విలువైన సలహాలు సూచనలను ఇస్తూ రైతులందరి అభిమానాన్ని పొందారు.
విజయ్ కుమార్ హైదరాబాద్, కర్నూలు, నిజామాబాద్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో 32 సంవత్సరాలుగా సుదీర్ఘ సేవలందించి డిసెంబరు 31న పదవీవిరమణ చేయనున్నారు. రైతులకు అమూల్యమైన సలహాలు ఇచ్చి పాడి పంట పెద్దయ్యగా శ్రోతలను ఆకట్టుకున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా రైతులకు వివరిస్తూ ప్రతీ రైతు కుటుంబ సభ్యునిగా మారిపోయారు.
రైతులతో ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా మమేకం కావడమే కాకుండా కర్నూల్ నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రాలలో ప్రోగ్రాం డివిజన్ ఇంఛార్జిగా పని చేసారు. విజయవాడ కృష్ణవేణి ఎఫ్ఎంను తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర అమోఘం.. 32 సంవత్సరాలుగా ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా రైతులకు చేరువైన విజయ్ కుమార్ విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి నేటితో పదవీవిరమణ చేయనున్నారు. వృత్తిలో భాగంగా ఆయన రైతులకు ఇచ్చిన స్ఫూర్తి మరువలేనిది. పదవీవిరమణ అనంతరం ఆయన సుఖమయ,ఆనందమయ, ఆరోగ్యమయ జీవితాన్ని గడపాలని కోరుకుందాం.