మహారాష్ట్రలో అనేక మలుపులు తిరిగిన రాజకీయ పరిణామాలపై శివసేన స్పందించింది. శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కి సంబంధం లేదని తెలిపారు. నిన్న రాత్రి వరకూ అజిత్ పవార్ తమతోనే ఉన్నాడని, కానీ అనుకోకుండా మాయమై పోయాడని పేర్కొన్నారు. అప్పుడే తమకు అనుమానం అజిత్ పవార్ పై అనుమానం వచ్చిందని తెలిపారు. అజిత్ పవార్ ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఛత్రపతి శివాజీ సిద్ధాంతాల్ని అవమానించారని వ్యాఖ్యానించారు. శరద్ పవార్, ఉద్దవ్ థాక్రే టచ్ లోనే ఉన్నారని ఇద్దరు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంజయ్ రౌత్ తెలిపారు.
గత నెలరోజులుగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకోసం జరుగుతున్న ప్రయత్నాలకు ఈరోజు తుది దశకు చేరుకుంది.గతంలో ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలకు సరిపడా బలం లేకపోవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. అనూహ్యపరిణామాల మధ్య బీజేపీ ఎన్సీపీ తో కలిసి ఈరోజు ఉదయం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి గా ఈ రోజు ఉదయం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ప్రమాణం చేయించారు.