iDreamPost
android-app
ios-app

ఒడి దుడుకులుతో సాగిన అజిత్ జోగి రాజకీయ ప్రస్థానం

  • Published May 29, 2020 | 12:16 PM Updated Updated May 29, 2020 | 12:16 PM
ఒడి దుడుకులుతో సాగిన అజిత్ జోగి రాజకీయ ప్రస్థానం

మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి విడిపోయి ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాడిన‌ ఛత్తీస్‌గ‌ఢ్ మొద‌టి ముఖ్య‌మంత్రి అజిత్ జోగి మృతి చెందారు. 74 ఏళ్ళ వయసులో ఆయ‌న మ‌ర‌ణించారు. అజిత్ జోగి గత రెండు వారాలుగా గుండెపోటుతో బాధపడ్డారు. అయన‌ దాదాపు మూడు వారాలు ఆసుపత్రిలో ఉన్నారు. అజిత్ జోగి మ‌ర‌ణ వార్తాను ఆయన కుమారుడు అమిత్ జోగి ట్విట్టర్‌లో ద్వారా ప్ర‌క‌టించాడు. “20 ఏళ్ల ఛత్తీస్‌గఢ్ ఒక తండ్రిని కోల్పోయింది. నేను మాత్రమే కాదు, ఛత్తీస్‌గఢ్‌, రాష్ట్ర పౌరులు ఒక తండ్రిని కోల్పోయారు” అని అమిత్ జోగి తన నివాళిలో పోస్ట్ చేశారు.

అజిత్ జోగి గత వారంలో రెండు సార్లు గుండెపోటుతో బాధపడ్డారు. అతను దాదాపు మూడు వారాలు ఆసుపత్రిలో ఉన్నారు. 2000లో రాష్ట్రం ఏర్పాడినప్పుడు కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగి ఛత్తీస్‌గఢ్‌ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 2016లో కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి…జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌(జె) పార్టీని పెట్టారు. మూడు సార్లు వ‌రుస‌గా ఎన్నికైన బిజెపి గ‌త 2018 ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందింది. కాంగ్రెస్ సింగిల్‌గా భారీ మెజార్టీ సాధించింది. ఆ ఎన్నిక‌ల్లో అజిత్ జోగి పార్టీ పాత్ర పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

అజిత్ జోగి తన జీవితమంతా కాంగ్రెస్ సభ్యుడుగా ఉండాలనుకున్నారు. కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి కొడుకుతో పాటు బహిష్కరించబడ్డాడు. రాహుల్ గాంధీతో అజిత్ జోగికి ఎప్పుడూ మంచి సంబంధాలు లేనప్పటికీ, నెహ్రూ-గాంధీ కుటుంబంతో ఆయనకు సుదీర్ఘ సంబంధం ఉంది. ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో అనుభవజ్ఞుడైన అజిత్ జోగి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సేవలను విడిచిపెట్టి కాంగ్రెస్‌లో చేరాలని ఒప్పించారు. గాంధీ కుటుంభానికి విధేయులైన దిగ్విజయ సింగ్, అర్జున్ సింగ్ లు అజిత్ జోగిని రాజకీయ ప్రాముఖ్యతలోకి తీసుకువచ్చారు.

1986 లో కాంగ్రెస్ త‌ర‌పున అప్ప‌టి మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి అజిత్ జోగి రాజ్యసభలో ప్రవేశించారు. అతను 1998 వరకు రెండు పర్యాయాలు రాజ్య‌స‌భ స‌భ్యుడుగా కొనసాగారు. 1998లో అతను రాయ్‌గర్‌ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కాని ఆయ‌న ఏడాది తరువాత షాడోల్ నుండి ఓడిపోయారు. 2000లో ఛత్తీస్‌గఢ్‌ ఏర్పడినప్పుడు 90 స్థానాల్లో 48 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్ గిరిజనుడిని ముఖ్యమంత్రిగా నామినేట్ చేసింది.

అజిత్ జోగి 2004 లోక్ స‌భ‌ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రచారం సందర్భంగా అజిత్‌ జోగి కారు ప్రమాదంలో గాయపడ్డాడు. దాంతో ఆయ‌న‌ కొన్ని రోజుల పాటు ప్ర‌చారానికి దూరం అయ్యారు. అయిన‌ప్ప‌టికీ ఆ ఎన్నిక‌ల్లో దాదాపు 1.2 లక్షల ఓట్ల తేడాతో ఆయన ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఆ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇది. రాష్ట్రంలో బ‌ల‌మైన‌ పార్టీ నాయకుడిగా జోగి హోదాను పోందారు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అజిత్ జోగిని ముందు పెట్టింది. కాని రామన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అజిత్ జోగి బిజెపి చేతిలో ఓడిపోయారు.