iDreamPost
android-app
ios-app

పెళ్ళి ఆలోచన అందుకే మానేశాను – తేజస్వి మదివాడ

పెళ్ళి ఆలోచన అందుకే మానేశాను – తేజస్వి మదివాడ

సినిమాలతో పాటు బిగ్ బాస్ తోనూ ఫేమ్ దక్కించుకున్న తెలుగమ్మాయి తెేజస్వి మదివాడ. తాజాగా ఆమె నటించిన కమిట్మెంట్ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొంది తెజస్వి. ఈ సందర్భంగా అనేక అంశాలను మీడియాతో పంచుకుంది.

ఇండస్ట్రీలో సహజంగా జరిగే అంశాలెన్నో తన పాత్రలో ఉన్నాయని, అందుకే కథ వినగానే ఒప్పుకున్నట్లుగా చెప్పింది తెేజస్వి. కమిట్మెంట్ అనే అంశంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా ఈ సబ్జెక్ట్ వేరుగా ఉంటుందని చెప్పింది.

అయితే సినిమాలోని కంటెంట్ డిమాండ్ చేస్తే ఏ బోల్డ్ సీన్స్ లో నటించేందుకు సైతం సిద్ధమని క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో శ్రీనాథ్ తనతో రొమాంటిక్ సీన్లలో ఇబ్బంది పడ్డాడని చెప్తూ నవ్వేసింది. ఇక కమిట్మెంట్ అనే అంశం గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఇప్పటివరకు తనని అలా ఎవరూ అడగలేదని, తనతో అలా అడగాలంటే భయపడేవాళ్ళని తెలిపింది.

తనకు ఇప్పటికీ అవకాశాలు వస్తున్నప్పటికీ,  ‘కేరింత’ సినిమాలో లాంటి క్యారెక్టర్స్‌ ఎవరూ ఆఫర్ చేయడం లేదని అంటోంది తేజస్వి. ఎక్కువగా చెల్లి, అక్క పాత్రలే ఇస్తున్నారని, అవి కాదంటే బోల్డ్ గా ఉండే పాత్రలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ కు వెళ్ళడం వల్లే తాను సినిమా ఆఫర్లను పోగొట్టుకున్నాను అనే మాట వాస్తవం కాదని స్పష్టం చేసింది తేజస్వి. కేవలం ఆ షో వల్లే తాను కారు, ఇల్లు కొని ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. డబ్బు కోసం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపింది. తన జీవితాన్ని ఎలా గడపాలో తనకు తెలుసని కుండబద్దలు కొట్టేసింది తేజస్వి.

ఇక సినిమాలు మానేసి ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేసుకోమంటున్నారని.. అందుకే పెళ్ళి చేసుకోవడమే మానేశానని నన్వేసింది తెేజస్వి.

marsbahis girişjojobet girişjojobet girişjojobetjojobet girişJOJOBET GİRİŞjojobetjojobet girişgamdomgrandpashabetCasibomjojobet girişholiganbet girişMarsbahis