సైరా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఆచార్య బిజినెస్ దశలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక కమర్షియల్ సినిమా అందులోనూ బాహుబలి తరహా గ్రాండియర్ కాని మూవీకి ఈ స్థాయిలో ఆఫర్లు రావడం చూసి ట్రేడ్ సైతం షాక్ అవుతోంది. నిన్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను ఆచార్య నైజాం హక్కులను 42 కోట్లకు సొంతం చేసుకున్నాడన్న వార్త సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్ లోనూ బాగా వైరల్ అయ్యింది. బాహుబలి 2, సాహోల తర్వాత అంత పెద్ద మొత్తం ఒక్క నైజామ్ ఏరియాకు పలికింది ఆచార్యనే. ఇది మెగా స్టామినా అంటూ అభిమానులు అప్పుడే దీని గురించి ప్రచారం మొదలుపెట్టారు.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఆచార్య ఇతర ప్రాంతాల డీల్స్ కూడా దాదాపు క్లోజ్ అయినట్టుగా సమాచారం. సుమారుగా 150 కోట్ల దాకా ఫిగర్స్ ని నిర్మాతలు రాబట్టుకున్నట్టు వినికిడి. ఇది కేవలం థియేట్రికల్ హక్కుల ద్వారా జరిగింది మాత్రమే. సీడెడ్ 20 కోట్లు, ఉత్తరాంధ్ర 14 కోట్ల 50 లక్షలు, ఈస్ట్ గోదావరి 11 కోట్లు, వెస్ట్ గోదావరి 8 కోట్ల 50 లక్షలు, కృష్ణా 10 కోట్లు, గుంటూరు 12 కోట్లు, నెల్లూరు 4 కోట్లు, కర్ణాటక 18 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా 10 కోట్లు, ఓవర్సీస్ 12 కోట్ల దాకా జరిగినట్టు తెలిసింది. ఇవి అధికారికంగా వచ్చిన ఫిగర్స్ కాకపోయినా ట్రేడ్ లో వీటి మీద పెద్ద చర్చే జరుగుతోంది.ఏదైనా మార్పు ఉన్నా కూడా చివరికి 130 నుంచి 140 కోట్ల మధ్యలో సెట్ కావడం ఖాయం.
నిజానికి టీజర్ వచ్చాక ఆచార్య మీద అంచనాలు పెరిగాయి. ఇంకా రామ్ చరణ్ ని రివీల్ చేయకుండానే ఈ స్థాయిలో క్రేజ్ వస్తే రేపు ట్రైలర్ వచ్చాక ఇంకే రేంజ్ లో హైప్ పెరుగుతుందో ఊహకు అందటం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత భారీగా జరుగుతున్న బిజినెస్ ఆచార్యదే. తీసిన నాలుగు సినిమాల్లో ఫ్లాప్ ఎరుగని కొరటాల శివ బ్రాండ్ కూడా ఆచార్యకు బాగా పని చేస్తోంది. టాక్ కనక పాజిటివ్ వస్తే మాత్రం కలెక్షన్లకు ఆకాశమే హద్దవుతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ కు జోడిగా పూజా హెగ్డే అనే టాక్ ఉంది కానీ ఆ న్యూస్ ఇంకా అఫీషియల్ కాలేదు.