iDreamPost
android-app
ios-app

విశాఖలో విషాదం.. కూలిన క్రేన్‌

విశాఖలో విషాదం.. కూలిన క్రేన్‌

విశాఖ నగరంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన గ్యాస్‌లీకేజీ తర్వాత పరిశ్రమ ప్రాంతాల్లో వరుస విరామాల్లో దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా విశాఖ హిందుస్థాన్‌ షిప్‌ యార్డు లిమిటెడ్‌లో భారీ క్రేన్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడిక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. క్రేన్‌ కింద మరికొంత మంది కూలీలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

క్రేన్‌ కూలీన ఘటన స్థానికంగా ఉండే సిబ్బంది తమ ఫోన్లలో బంధించారు. ఒక్కసారిగా క్రేన్‌ కుప్పకూలింది. అంతా క్షణాల్లో జరగడంతో అక్కడ పని చేసే కూలీలు దుర్ఘట నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబీకులు షిప్‌ యార్డుకు చేరుకున్నారు. అయితే వారిని షిప్‌ యార్డు సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో వారు మృతులను తరలించే అంబులెన్స్‌లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

కాగా, విశాఖపట్నంలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డులో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్‌ ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.