iDreamPost
android-app
ios-app

అదే ఆక్రోశం.. మారని పద కోశం..

  • Published Sep 12, 2021 | 10:22 AM Updated Updated Sep 12, 2021 | 10:22 AM
అదే ఆక్రోశం.. మారని పద కోశం..

కొత్త పలుకులో ఆంద్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కూడా ఎప్పటి లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తన ఆక్రోశం వెళ్లగక్కారు. అవసరం ఉన్నా లేకపోయినా ఒకటికి పదిసార్లు జగన్ రెడ్డి అని ముఖ్యమంత్రిని సంబోధించి రెడ్డి అనే పదాన్ని నెగిటివ్ కోణంలో జనంలోకి తీసుకువెళుతున్నానని భ్రమించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలనూ తన రచనా సామర్థ్యంతో జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా మార్చగలననే నమ్మకంతో అక్షరాలు సిగ్గుపడేలా విన్యాసాలు చేసే ఆయన ఈసారి సినిమా నటులను తన అస్త్రాలుగా ఎంచుకున్నారు.

జగన్ తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా రంగం సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆ రంగంలోని వారికి విలువ ఇవ్వడం లేదని తీర్మానించేశారు. ఇప్పటి వరకు పాలించిన తెలుగు ముఖ్యమంత్రులు ఎవరూ ఈ స్థాయిలో సినిమా వాళ్లతో ఆడు కోలేదని వ్యాఖ్యానించి చాలా తెలివిగా వారికి, వీరికి జుట్లు ముడి వేసేశానని అనుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్కు తీసుకువస్తున్న కొత్త విధానంపై రెండు రోజుల క్రితమే మొదటి పేజీలో తనదైన స్థాయి ఏడుపు గొట్టు కథనంతో కదం తోకిన రాధాకృష్ణ దానితో సంతృప్తి చెందలేకపోయారు. అందుకే విషయాన్ని, అందులో ఉన్న ప్రజా ప్రయోజన కోణాన్ని పక్కదారి పట్టించడానికి, తన వంటకంలో రుచి పాఠకుడు పసిగట్టకుండా ఉండడానికి మసాలా బాగా దట్టించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశినించ లేక పోతున్న సినీ రంగంలో ప్రముఖులనే కాకుండా ప్రేక్షకుల పై సైతం తన కడుపు మంట తీర్చుకున్నారు.

జగన్మోహనరెడ్డి అంటే సినీ రంగం వారు భయపడి పోతున్నారని అందుకే వారు నోరు విప్పడం లేదని, అయినా పేదవాడి కోపం పెదవికి చేటు కదా అని ఒక వ్యాఖ్య జోడించి ఒక్క దెబ్బకు సినీరంగంలో వారందరినీ పేదవాళ్లను చేసేశారు. ఇదే వ్యాసంలో సినిమాకు రూ. 20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని యాక్టర్లపై అక్కసు వెళ్లబోసుకున్నారు. ఆ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నా వారు పేదలే అని రాధాకృష్ణ రాశారు కనుక మనం ఒప్పుకోవాలి మరి!

ఏ సినీ నటుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ నటుడి సినిమాకు టికెట్ను ప్రభుత్వ సైట్ లో ఆన్ లైన్లో బుక్ చేసుకున్న వారి రేషన్ కార్డును, ఇతర పథకాల లబ్ధిని జగన్మోహనరెడ్డిని నిలిపివేస్తారని రాసి ప్రజలను భయపెట్టాలని చూశారు. అదే చంద్రబాబు హయాంలో అయితే సినీనటులను విపరీతంగా గౌరవించడమే కాకుండా వారికి బాబు గారు భయపడి పోయేవారని సెలవిచారు.

Also Read : కాకినాడలో మేయర్ పీఠం కోల్పోనున్న టీడీపీ

ఐఏఎస్ లనూ భయపెట్టాలని..

రాష్ట్రంలో ఐఏఎస్ లను ప్రభుత్వా నికి వ్యతిరేకంగా రెచ్చగొటె బాధ్యతను ఎప్పుడో తలకెత్తుకున్న రాధాకృష్ణ వారు చేస్తున్నది ఉద్యోగం కాదని, జైలు పాలయ్యే అవకాశం ఉన్న ప్రమాద కరమైన సాహసంగా చిత్రీకరించాలని ప్రయతించారు. ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపొయే పరిస్థితి వస్టె కనీసం ఓ 25 మంది ఐ ఐఏఎస్ లు కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నారని లెక్క గట్టారు. బహుశా వారందరూ ఈయన దగ్గరే రోజు అటెండెన్స్ వేయించుకుంటు
న్నారేమో!

చీకటి ఒప్పందం దారులతో రాధాకృష్ణ సంభాషణ ..

రాష్ట్రంలో అప్పుల మీద అప్పులు చేస్తున్న జగన్మోహనరెడ్డి తప్పులు కూడా అనేకం చేస్తున్నారని ఈయనగారు నిర్ధారించారు. అనేక చీకటి ఒప్పందాలతో అవినీతికి పాలుపడుతు న్నారని, అ డబ్బంతా ఏమి చేసుకుంటారని ప్రశ్నను సాధించారు. అంతేకాక చీకటి ఒప్పందాలతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి ఈయనతో మాట్లాడినట్టు రాశారు. మీరు చేసే తప్పులకు రేపు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది కదా అని రాధాకృష్ణ అమాయకంగా అడిగినట్టు, అతనేమో మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని బదులు ఇచ్చినట్టు రాసేసి పాఠకుల చెవుల్లో బాగా పువ్వులు పెట్టానని మురిసిపోయారు.

మీకు మాత్రం ఎందుకు?

కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అంటూ కొత్త పలుకును ప్రారంభించిన రాధాకృష్ణ ఇదే ప్రశ్నను పాఠకులు తనను అడిగితే ఏం సమాధానం చెబుతారో? టికెట్ బుకింగ్ నిర్ణయంపై సినీ ప్రముఖులుగానీ, తమకు సమస్యలు ఉన్నాయని ఐఏఎస్ లు గానీ, వివిధ వర్గాల ప్రజలు గానీ చెప్పనప్పుడు ఈ బాధ ఎందుకు? ఎవరికీ లేని ఇబ్బంది ఈయనకు ఏమిటీ? అనే ప్రశ్నలు తలెత్తకమానవు.

Also Read : అవును..నిజమే, ఆంధ్రజ్యోతి కి అన్నీ అలానే కనిపిస్తాయి.!